News December 30, 2024
పెన్షన్లపై శుభవార్త చెప్పిన ప్రభుత్వం

AP: ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో స్పౌజ్ కేటగిరీని కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది. పెన్షన్ పొందుతున్న వ్యక్తి చనిపోతే అతని భార్యకు ఈ కేటగిరీ కింద మరుసటి నెల నుంచే పెన్షన్ ఇవ్వనుంది. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు గుర్తించిన 5,402 మందికి రేపు పెన్షన్ అందించనుంది. అలాగే వివిధ కారణాలతో 2 లేదా 3 నెలలు పెన్షన్ తీసుకోని 50వేల మందికీ రేపు మొత్తం పెన్షన్ ఇస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
Similar News
News January 1, 2026
సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం?

AP: సింగర్ మంగ్లీ ఈవెంట్లో విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతపురంలో శుభారంభ్ పేరుతో నిర్వహిస్తున్న న్యూఇయర్ వేడుకల్లో ఓ యువకుడు చనిపోయాడని సమాచారం. వేణుగోపాల్ నగర్‌కు చెందిన షౌకత్ కరెంట్ షాక్‌తో మృతి చెందాడని తెలిసింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేడుకల సమయంలో జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News January 1, 2026
జనవరి 1: చరిత్రలో ఈరోజు

1892: స్వాతంత్ర్య సమరయోధుడు మహదేవ్ దేశాయ్ జననం
1894: గణిత శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్ జననం
1911: స్వాతంత్ర్య యోధురాలు ఎల్లాప్రగడ సీతాకుమారి జననం
1975: నటి సోనాలి బింద్రే జననం
1979: నటి విద్యాబాలన్ జననం
1955: శాస్త్రవేత్త శాంతిస్వరూప్ భట్నాగర్ మరణం (ఫొటోలో)
1994: తెలుగు రచయిత చాగంటి సోమయాజులు మరణం (ఫొటోలో)
2007: తెలుగు సినీ నిర్మాత డూండీ మరణం
News January 1, 2026
ఈడీ సోదాల్లో నోట్ల కట్టలు.. సూట్‌కేస్ నిండా ఆభరణాలు!

ఢిల్లీలో జరిపిన సోదాల్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలను ED గుర్తించింది. ఓ సూట్‌కేసులో ₹8.8 కోట్ల విలువైన బంగారు, వజ్రాభరణాలు ఉన్నాయి. మరోవైపు ₹5 కోట్ల నగదుతోపాటు ₹35 కోట్ల ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో ఇంద్రజిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి నివాసంలో ఈడీ సోదాలు చేపట్టింది. హరియాణాకు చెందిన ఇంద్రజిత్ సెటిల్మెంట్లు, బెదిరింపు వంటి కేసుల్లో నిందితుడు. UAEలో పరారీలో ఉన్నాడు.


