News March 19, 2025
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

TG: బడ్జెట్లో రైతు భరోసాకు రూ.18 వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇక ఏడాదికి ఎకరానికి రూ.12 వేల చొప్పున అందుతాయని చెప్పారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా రైతు భరోసా అందిస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం బడ్జెట్‌గా రూ.24,439 కోట్లు కేటాయించడం గమనార్హం. ఇప్పటికే మూడు ఎకరాల లోపు వారికి రైతు భరోసా నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 19, 2025
17 మంది మృతి.. J&K ప్రభుత్వం కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్‌లో 3 కుటుంబాల్లోని 17 మంది అనుమానాస్పదంగా <<15242949>>మృతి చెందడంపై<<>> అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి శరీరాల్లో 6 రకాల విషపదార్థాలు(అల్యూమినియం, కాడ్మియం, ఆల్డికార్బ్ సల్ఫేట్, ఎసిటామిప్రిడ్, డైథైల్డిథియోకార్బమేట్, క్లోర్ఫెనాపైర్) ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని తెలిపింది. బాక్టీరియల్, వైరల్ సంబంధిత వ్యాధులుగా నిర్ధారణ కాలేదంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది.
News March 19, 2025
ఫ్యామిలీ రూల్ పాలసీ మారదు: BCCI సెక్రటరీ

విదేశీ పర్యటనల ఫ్యామిలీ రూల్స్‌పై <<15777927>>కోహ్లీ<<>> వ్యాఖ్యలకు BCCI సెక్రటరీ సైకియా కౌంటర్ ఇచ్చారు. ఈ రూల్స్‌ను సమీప భవిష్యత్తులో మార్చబోమన్నారు. ‘దీనిపై కొందరికి ఆగ్రహం, భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. రాత్రికి రాత్రే ఈ విధానం తేలేదు. పాత నిబంధనలకే సవరణ చేశాం. ప్రాక్టీస్ సెషన్లలో ఆటగాళ్ల హాజరు, మ్యాచ్ షెడ్యూల్లు, పర్యటనలు తదితర నిబంధనలున్నాయి. ఇవి జట్టు సమన్వయం, ఐక్యత కోసం తీసుకున్న నిర్ణయాలు’ అని తెలిపారు.
News March 19, 2025
హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్

TG: మెక్‌డొనాల్డ్స్ తన గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు CM రేవంత్ మెక్‌డొనాల్డ్స్ CEO క్రిస్ కెమ్కిన్స్కితో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా 2,000 ఉద్యోగాల కల్పన జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటికే 38 మెక్‌డొనాల్డ్స్ అవుట్లెట్లు ఉండగా, ఇక నుంచి ఏటా 3- 4 కొత్త అవుట్లెట్లు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రైతులు దాని కార్యకలాపాలకు తాజా ఉత్పత్తులను సరఫరా చేయనున్నారు.