News November 29, 2024
ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐఆర్ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బేసిక్ శాలరీపై 5శాతం పెంచింది. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలతో పాటు యూనివర్సిటీల్లోని ఉద్యోగులకు ప్రయోజనం అందనుంది.
Similar News
News April 1, 2026
‘ఏప్రిల్ ఫూల్’ ఎలా వచ్చిందంటే?

ఏటా ఏప్రిల్ 1న ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ ఫూల్స్ చేయడం చూస్తుంటాం. అయితే దీని వెనుక ఓ ఆసక్తికరమైన రూమర్ ఉంది. 1582లో ఫ్రాన్స్ తన క్యాలెండర్‌ను మార్చినప్పుడు కొత్త సంవత్సరం జనవరి 1న ప్రారంభమవుతుందని ప్రకటించింది. అయితే ఈ మార్పు తెలియక APR 1నే వేడుకలు చేసుకున్న వారిని అందరూ ‘ఫూల్స్’ అని పిలవడం మొదలుపెట్టారు. అలా ఈ ఏప్రిల్ ఫూల్ ప్రారంభమైందట. ఏదో ఒక సమయంలో మీరూ ఏప్రిల్ ఫూల్ అయ్యే ఉంటారు కదూ. COMMENT
News April 1, 2026
నయన్ సెన్సేషన్.. ఒకేసారి 5 భాషల్లో!

నటి నయనతార ఒకేసారి 5 భాషల్లో అగ్ర హీరోలతో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో ఓ మూవీ షూటింగ్ దశలో ఉండగా తమిళ్‌లో 2 చిత్రాలు విడుదలకు రెడీ అయ్యాయి. మరొకటి షూటింగ్ జరుపుకుంటోంది. మలయాళంలో 2 సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. కన్నడలో నయన్ యాక్ట్ చేసిన టాక్సిక్ రిలీజ్‌కు సిద్ధమైంది. అటు బాలీవుడ్‌లో ఇప్పటికే షారుఖ్‌తో నటించిన ఆమె తాజాగా సల్మాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.
News April 1, 2026
Gmail ఐడీకి తోకలు.. గుడ్‌న్యూస్ చెప్పిన పిచాయ్

పాత Gmail ఐడీలో ‘తోకలు’(saiRam143), వింత పేర్లున్నాయని ఇబ్బంది పడుతున్నారా? గూగుల్ మీకోసం ఓ అదిరిపోయే అప్‌డేట్ తెచ్చింది. మీ పాత యూజర్‌నేమ్ మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దీనికోసం గూగుల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. అందుబాటులో ఉన్న నచ్చిన పేరును ఎంచుకోండి. పాత ఐడీ అలాగే ఉన్నప్పటికీ రెండు పేర్లతోనూ సైన్ ఇన్ అవ్వొచ్చు. ID మార్చుకునేవారికిది శుభవార్తే.


