News November 28, 2024
పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం కసరత్తు!

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 14న నోటిఫికేషన్ విడుదల చేసి 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అటు ఈ సారి ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హులనే నిబంధనను ఎత్తివేయనుంది. అలాగే రిజర్వేషన్లలో మార్పులు, చేర్పులపై ప్రణాళికలు రచిస్తోంది.
Similar News
News November 12, 2025
గజం రూ.3.40 లక్షలు.. 8 ఏళ్లలో 4 రెట్లు

TG: రాయదుర్గంలోని హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ(HKC)లో గజం ధర రూ.3.40 లక్షలు పలికినట్లు TGIIC ఎండీ శశాంక తెలిపారు. 2017లో అక్కడ రూ.88వేలుగా ఉన్న ధర ప్రస్తుతం నాలుగు రెట్లు పెరిగినట్లు వెల్లడించారు. మొత్తం 4,770 గజాల స్థలాన్ని రూ.159 కోట్లకు విక్రయించామన్నారు. ఇక కోకాపేట, మూసాపేటలోని ఖాళీ ప్లాట్ల వేలం కోసం ప్రీబిడ్ సమావేశం ఈ నెల 17న టీహబ్లో నిర్వహించనున్నట్లు HMDA ప్రకటించింది.
News November 12, 2025
GOOD NEWS: ఎల్లుండి నుంచి ‘సదరం’ స్లాట్ బుకింగ్

APలోని దివ్యాంగులకు శుభవార్త. వారి వైకల్య నిర్ధారణకు ఈ నెల 14 నుంచి సదరం స్లాట్ బుకింగ్ను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలలకు స్లాట్లు అందుబాటులో ఉంటాయని, గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకోవాలని సూచించారు. ఆయా తేదీల్లో నిర్దేశించిన జిల్లా, బోధనాస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే పెన్షన్లకు అర్హత సాధిస్తారు.
News November 12, 2025
నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చేరారు. చికిత్స అనంతరం ఇవాళ ధర్మేంద్రను ఇంటికి పంపించారు.


