News July 16, 2024
గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP: రాష్ట్రంలోని SC, ST వర్గాలకు చెందిన డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాల పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణం ఇవ్వనుంది. దీన్ని వారు వాయిదాల రూపంలో చెల్లించాలి. 2024-25 ఏడాదికిగానూ రూ.250 కోట్లు రుణంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే సంబంధిత ఫైల్‌పై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సంతకం చేశారు.
Similar News
News April 2, 2026
ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.
News April 2, 2026
హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.
News April 2, 2026
హనుమంతుడికి 5 ముఖాలు ఎలా వచ్చాయి?

రామరావణ యుద్ధంలో మైరావణుడు రామలక్ష్మణులను అపహరించి పాతాళంలో బంధిస్తాడు. అతడిని అంతం చేయాలంటే 5 దీపాలు ఒకేసారి ఆర్పాలి. అందుకే హనుమాన్ పంచముఖ రూపం ధరించి, ఆ దీపాలను ఆర్పి మైరావణుడిని వధించాడు. దుష్టశిక్షణ కోసం ఉద్భవించిన ఈ మహోగ్ర రూపం భక్తులకు సర్వ శుభాలను చేకూరుస్తుందని నమ్మకం. పంచముఖ హనుమత్ స్తోత్రం జపించి, ఆయనను పూజిస్తే దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.


