News November 19, 2024

గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

image

AP: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. గతంలో వారు సమ్మె చేసిన కాలాన్ని డ్యూటీ పీరియడ్‌గా పరిగణిస్తూ ప్రభుత్వం జీతాలు విడుదల చేసింది. దీంతో సీఎం చంద్రబాబు, మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు PHC డాక్టర్ల సంఘం ధన్యవాదాలు తెలిపింది. కాగా సెప్టెంబర్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ అడ్మిషన్లలో జీవో 85ను వ్యతిరేకిస్తూ వారంతా 10 రోజుల పాటు ఆందోళనలు చేశారు.

Similar News

News November 29, 2024

సోయాబీన్ కొనుగోళ్లలో తొలి స్థానంలో తెలంగాణ

image

సోయాబీన్ కొనుగోళ్లలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని మార్క్‌ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు ఇచ్చిన నిర్ణీత లక్ష్యంలో 74 శాతం పూర్తయినట్లు చెప్పారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు 1-2 శాతమే కొనుగోళ్లు చేశాయని పేర్కొన్నారు. కనీస మద్దతు ధరకు 59,708 టన్నులు కొనుగోలు లక్ష్యం కాగా 43,755 టన్నులు కొనుగోలు చేసినట్లు ప్రకటనలో తెలిపారు.

News November 29, 2024

SSC: 64 వేల మంది మీడియం మార్చుకున్నారు!

image

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షలను <<14665980>>తెలుగు మీడియంలో<<>> రాసేందుకు విద్యాశాఖ అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. దీంతో 64,600 మంది తాము తెలుగులో పరీక్షలు రాస్తామని మీడియంను మార్చుకున్నారు. 5 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంగ్లిష్‌లోనే ఎగ్జామ్స్ రాయనున్నారు. కొందరు ఉర్దూ, కన్నడ లాంటి ఇతర భాషలనూ ఎంపిక చేసుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 6,42,635 మంది వార్షిక పరీక్షల కోసం ఫీజులు చెల్లించారు.

News November 29, 2024

నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ‘దీక్షా దివస్’

image

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బీఆర్ఎస్ ఏటా నవంబర్ 29న దీక్షా దివస్ నిర్వహిస్తోంది. ఇవాళ అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనుంది. 2009, NOV 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చే వరకూ 11 రోజులపాటు కేసీఆర్ దీక్షను కొనసాగించారు.