News December 10, 2024
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

AP: డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని త్వరలోనే లబ్ధిదారులకు ‘క్రిస్మస్ కానుక’ అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి మాట్లాడారు. ‘త్వరలోనే అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభిస్తాం. ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తాం. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలల్లోనే రుణాలు అందిస్తాం’ అని మంత్రి ప్రకటించారు.
Similar News
News September 22, 2025
వచ్చే నెలలో ప్రభుత్వ ఇంటర్ కాలేజీలకు డిజిటల్ స్క్రీన్లు

TG: సర్కారు జూనియర్ కాలేజీల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెలలో వీటిని కళాశాలలకు అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటి ఏర్పాటు కోసం ప్రతీ కాలేజీకి ఫ్రీ ఇంటర్నెట్, జూమ్ కనెక్షన్ సదుపాయం కల్పించనున్నారు. ఈ స్క్రీన్ల ద్వారా జేఈఈ, నీట్, ఎప్ సెట్ తదితర ప్రవేశపరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.
News September 22, 2025
నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.
News September 22, 2025
ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

ఇవాళ ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, చిత్తూరు, తిరుపతిలో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. అటు తెలంగాణలో నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, గద్వాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని IMD ఎల్లో అలర్ట్ జారీ చేసింది.