News February 9, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం

AP: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హులైన వారి నుంచి వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 OCT 15 ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే దరఖాస్తులు స్వీకరించనుండగా, లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News October 17, 2025
తెలంగాణ న్యూస్ రౌండప్

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ
News October 17, 2025
ఫేక్ ORSలపై యుద్ధంలో గెలిచిన హైదరాబాద్ డాక్టర్

ప్రస్తుతం మార్కెట్లో ORS పేరిట హానికారక ద్రావణాలను టెట్రా ప్యాకెట్లలో అమ్ముతున్నారు. వీటిని వాడటం పిల్లలకు, మధుమేహులకు, వృద్ధులకు ప్రమాదమని సీనియర్ పీడియాట్రిషియన్ శివరంజని సంతోష్ అంటున్నారు. వీటికి వ్యతిరేకంగా ఆమె 8ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా WHO ఆమోదం పొందిన ఉత్పత్తులు మాత్రమే ORS పేరును ఉపయోగించాలని FSSAI ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర బ్రాండ్లు ORS లేబుల్ ముద్రించవద్దని సూచించింది.
News October 17, 2025
బ్యాంక్ కాల్స్ ఇక ఈ నంబర్ నుంచే!

స్పామ్ కాల్స్తో ఇబ్బందిపడుతున్న వినియోగదారులకు త్వరలో ఉపశమనం లభించనుంది. ఇకపై బ్యాంకు నుంచి వచ్చే కాల్స్ ‘1600’తో మొదలయ్యే నంబర్తో మాత్రమే రానున్నట్లు తెలుస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ & బీమా కంపెనీలు 1600తో ప్రారంభమయ్యే నంబర్ల నుంచి మాత్రమే కాల్ చేయాలని TRAI నిర్ణయించింది. గతంలో ఈ సిరీస్ కొన్ని బ్యాంకులకే పరిమితంగా ఉండేది. ఇతర కంపెనీలు పాత 140 లేదా మొబైల్ నంబర్ నుంచి కాల్స్ చేసేవి. SHARE IT