News February 26, 2025
మహా శివరాత్రితో మహా కుంభమేళాకు తెర

ప్రపంచంలోనే అతిపెద్ద వేడుక మహాకుంభ మేళా నేటితో ముగియనుంది. మహా శివరాత్రి పర్వదినంతో ఈ మహత్తర కార్యక్రమానికి తెరపడనుంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పటివరకు 65 కోట్ల మంది స్నానాలు ఆచరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చివరి రోజైన ఇవాళ 2 కోట్ల మంది రానున్నట్లు అంచనా.
Similar News
News February 26, 2025
నేటి నుంచి రంజీ ట్రోఫీ ఫైనల్

2024-25 సీజన్ రంజీ ట్రోఫీ ఫైనల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. క్వార్టర్స్‌లో ఒకటి, సెమీస్‌లో 2 రన్స్ ఫస్ట్ ING లీడ్‌తో అనూహ్యంగా తొలిసారి ఫైనల్ చేరిన కేరళ, 2సార్లు టైటిల్ విన్నర్ విదర్భ జట్లు తుదిపోరులో తలపడనున్నాయి. అక్షయ్ వాడ్కర్(C), కరుణ్ నాయర్, మాలేవర్‌లతో విదర్భ బ్యాటింగ్ బలంగా ఉంది. అటు, సచిన్ బేబీ నేతృత్వంలోని కేరళ బ్యాటర్లు నిజార్, అజహరుద్దీన్, బౌలర్ జలజ్ సక్సేనాలపై ఆశలు పెట్టుకుంది.
News February 26, 2025
అహ్మదాబాద్ తరహాలో అమరావతిలో స్టేడియం: లోకేశ్

AP: అహ్మదాబాద్ మాదిరి అమరావతిలోనూ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. దీనికి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) అంగీకారం తెలిపిందని చెప్పారు. ఇటీవల భారత్-పాక్ మ్యాచ్ కోసం తాను దుబాయ్ వెళ్లానని, ఆ సమయంలో మన జట్టుకు సపోర్ట్ చేయడంతో పాటు స్టేడియం నిర్మాణం, సీటింగ్ తదితరాలను పరిశీలించి జైషాతో మాట్లాడానన్నారు. దీనిపై కూడా YCP వాళ్లు తనను ట్రోల్ చేశారని వివరించారు.
News February 26, 2025
నేడు ప్రధానితో సీఎం రేవంత్ భేటీ

ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశం కానున్నారు. అపాయింట్‌మెంట్ అందడంతో రేవంత్ నిన్న రాత్రి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చివరిసారి గతేడాది జులైలో ఆయన పీఎంతో భేటీ అయ్యారు. ఇటీవల జరిగిన SLBC ప్రమాదంపై మోదీ ఆరా తీసే అవకాశం ఉంది. అటు మూసీ సుందరీకరణ, శంషాబాద్ వరకు మెట్రోరైల్, RRR నిర్మాణం సహా విభజన చట్టంలోని పెండింగ్ పనులు, నిధులపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు.