News May 20, 2024
గ్రామాన్నే కొనేసిన GST అధికారి

గుజరాత్‌కు చెందిన GST చీఫ్ కమిషనర్ చంద్రకాంత్ భారీ భూమి కొనుగోలు వ్యవహారం అందర్నీ నోరెళ్లబెడుతోంది. మహారాష్ట్ర మహాబలేశ్వర్ సమీపంలోని ఝదాని గ్రామంలో 620 ఎకరాల భూమిని బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి కొన్నారు. ప్రభుత్వం మీ భూమిని స్వాధీనం చేసుకుంటుందని గ్రామస్థులను భయపెట్టినట్లు సామాజిక కార్యకర్తలు తెలిపారు. పర్యావరణ, అటవీ సంరక్షణ చట్టాలు ఉల్లంఘించి 3 ఏళ్లుగా ఆ భూముల్లో నిర్మాణాలు సాగుతున్నాయన్నారు.
Similar News
News December 3, 2025
పలు జిల్లాలకు వర్షసూచన

AP: బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో నేడు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
News December 3, 2025
నవ దంపతులతో సత్యనారాయణ వ్రతం ఎందుకు చేయిస్తారు?

కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే నవ దంపతులు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని అందరూ కోరుకుంటారు. అలా వర్ధిల్లాలనే వారితో సత్యనారాయణస్వామి వ్రతం చేయిస్తారు. ఈ వ్రతం ఆచరిస్తే వారి జీవితంలో సకల సంపదలు, సౌభాగ్యాలు, సత్సంతానం కలుగుతాయని స్వయంగా నారాయణుడే నారదునికి చెప్పాడని నమ్ముతారు. సత్యనారాయణ స్వామి త్రిమూర్త్యాత్మకుడైన కలియుగ దైవం కాబట్టి, ఆయన ఆశీస్సులు ముందుగా పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
News December 3, 2025
ఊట వేసిన మడి, వాత వేసిన పశువు

‘ఊట వేసిన మడి’ అంటే నీటి లభ్యత పుష్కలంగా ఉన్న పొలం (మడి). ఇది ఎప్పుడూ పచ్చగా, సమృద్ధిగా ఉంటుందని, దిగుబడి బాగా వస్తుందని అర్థం. అలాగే పూర్వకాలంలో పశువులకు (ముఖ్యంగా ఆవులు, ఎద్దులు) వ్యాధులు వచ్చినప్పుడు లేదా గాయాలు తగిలినప్పుడు ‘వాత’ వేసి చికిత్స అందించి నయం చేసేవారు. ఇలా ఊట వేసిన మడి, వాత వేసిన పశువు వల్ల రైతుకు మేలే జరుగుతుందని ఈ సామెత చెబుతుంది.


