News June 27, 2024

గొంతులో పెరిగిన వెంట్రుక.. ఎట్టకేలకు విముక్తి!

image

2007 నాటి మాట. ఆస్ట్రియాకు చెందిన 52 ఏళ్ల చైన్ స్మోకర్‌కు గొంతులో 9 వెంట్రుకలు మొలిచాయి. వాటిని శాశ్వతంగా తొలగిస్తామని, అందుకు స్మోకింగ్ మానేయాల్సి ఉంటుందన్నారు వైద్యులు. అతడు ఒప్పుకోలేదు. ఇన్నేళ్లుగా వాటిని తాత్కాలికంగా తీయించుకుంటూ నరకం అనుభవించాడు. ఇక భరించలేక ఎట్టకేలకు స్మోకింగ్ మానేసి సర్జరీ చేయించేశాడు. సర్జరీ సక్సెస్ అని, గొంతులో ఇక వెంట్రుకలు రావని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

Similar News

News April 8, 2026

మోదీజీ ఎవరిని ఫూల్ చేస్తున్నారు: ప్రకాశ్ రాజ్

image

ముద్రా యోజన పథకం ద్వారా 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. 150 కోట్ల జనాభాలో 52 కోట్ల మంది వ్యాపారులుగా మారారా? అని ప్రశ్నించారు. ఎవరిని ఫూల్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అంతకుముందు ఈ పథకం ద్వారా అనేక మంది వ్యాపార కలలను సాకారం చేశామని ప్రధాని Xలో పోస్ట్‌ చేశారు. దాదాపు 52 కోట్ల మందిని వ్యాపారులుగా మార్చామన్న ‘MyGovIndia’ పోస్ట్‌ను షేర్ చేశారు.

News April 8, 2026

సమ్మర్‌లో ఇది నానబెట్టుకుని తింటే..

image

సమ్మర్‌లో గోండ్ కటీరా బాడీని కూల్ చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఒక నేచురల్ గమ్. Astragalus species అనే మొక్కల వేర్ల నుంచి సేకరిస్తారు. రాత్రి ఒక స్పూన్ కటీరాను గ్లాసు నీటిలో నానబెడితే జెల్లీలా తయారవుతుంది. దీన్ని షర్బత్, పాలు, నిమ్మరసంలో కలుపుకొని తాగాలి. డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. వెంట్రుకలు, చర్మ ఆరోగ్యానికీ మంచిది.

News April 8, 2026

BSNL ఫైబర్.. రూ.399తో 50Mbps వేగంతో హైస్పీడ్ డేటా

image

BSNL ఫైబర్ యూజర్లకు అదిరిపోయే న్యూస్. తక్కువ ధరలో ఎక్కువ డేటా కావాలనుకునే వారికోసం BSNL సరికొత్త ‘స్పార్క్’ ఫైబర్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం నెలకు రూ.399 చెల్లిస్తే 50 Mbps వేగంతో 3300GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అలాగే ఉచిత అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి. అయితే ఈ రూ.399 ధర మొదటి 12 నెలలు మాత్రమే వర్తిస్తుందని, 13వ నెల నుంచి రూ.449కి మారుతుందని సంస్థ స్పష్టం చేసింది.