News April 13, 2025

తొక్కిసలాట వెనుక భూమన హస్తం: బీఆర్ నాయుడు

image

AP: తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి టోకెన్ల తొక్కిసలాటపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఈ తొక్కిసలాట వెనుక వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, హరినాథ్ రెడ్డిల హస్తం ఉన్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ‘గోవుల మృతిపై భూమన మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం చేశారు. భూమనకు ఈ ఫొటోలను గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇచ్చారు. ఈ విషయంలో భూమనపై క్రిమినల్ కేసు పెడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News April 15, 2025

దర్శక నటుడు స్టాన్లీ కన్నుమూత

image

కోలీవుడ్ దర్శకుడు, నటుడు ఎస్ఎస్ స్టాన్లీ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ‘పుదుకొట్టయిరుందు శరవణన్’, ‘ఏప్రిల్ మంత్’, ఈస్ట్‌కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించారు. విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’ మూవీలో ఆయన చివరిసారిగా కనిపించారు.

News April 15, 2025

టీటీడీలో 2 వేల మంది మా వాళ్లే: భూమన

image

AP: టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 2 వేల మంది తమవారేనని YCP నేత, TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. టీటీడీలో జరిగే పరిణామాలపై వారు ఎప్పటికప్పుడు తమకు సమాచారం ఇస్తూనే ఉంటారని చెప్పారు. ‘గోశాలలో ఆవుల మృతిపై నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటా. నేను విడుదల చేసిన ఫొటోలు తప్పని తేలితే నాపై చర్యలు తీసుకోవచ్చు. నిజమైతే టీటీడీ ఈఓ, ఛైర్మన్‌ను తొలగించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

News April 15, 2025

అట్లీ-అల్లు అర్జున్ మూవీలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు?

image

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బన్ని సరసన ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరు ఖరారైందని, మరో హీరోయిన్‌గా దిశా పటానీని తీసుకుంటారని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ దాదాపు రూ.800 కోట్లతో తెరకెక్కించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

error: Content is protected !!