News December 15, 2024
తాజ్ మహల్‌ను కట్టినవారి చేతులు నరికారు: సీఎం యోగి

తాజ్‌మహల్ కట్టినవారి చేతుల్ని అప్పటి పాలకులు నరికితే.. రామమందిర కార్మికుల్ని బీజేపీ సర్కారు గౌరవించుకుందని UP CM యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ‘గుడిని నిర్మించిన కార్మికులపై రామమందిర ప్రారంభం రోజున ప్రధాని పూల వర్షం కురిపించారు. ఒకప్పటి పాలకులు తాజ్ మహల్ నిర్మాణ, వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతులు నరికారు. నైపుణ్యాన్ని అంతం చేశారు. నేడు భారత్ కార్మిక శక్తిని కాపాడుకుంటోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News October 29, 2025
తుఫాన్.. ప్రజలకు ఉచితంగా నిత్యావసరాలు

AP: మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలు, మత్స్యకారులకు ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేయనుంది. ప్రతి కుటుంబానికి 25కేజీల బియ్యం(మత్స్యకారులకు 50కేజీలు), లీటర్ నూనె, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, చక్కెర అందించనుంది. బియ్యం, కందిపప్పు, నూనె, చక్కెర సరఫరా వెంటనే ప్రారంభించాలని పౌరసరఫరాల శాఖను ఆదేశించింది. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేయాలని మార్కెటింగ్ కమిషనర్‌కు సూచించింది.
News October 29, 2025
భారీ వర్షాలు.. కల్లాల మీద ధాన్యం ఉందా?

కోతకోసి కుప్ప మీద ఉన్న ధాన్యాన్ని బరకాలు కప్పుకొని రైతులు రక్షించుకోవాలి. నూర్చిన ధాన్యం రెండు మూడు రోజులు ఎండబెట్టడానికి వీలులేని పరిస్థితుల్లో ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు, 20 కిలోల పొడి ఊక లేదా ఎండు వరిగడ్డిని కలిపితే గింజను వారం రోజులపాటు మొలకెత్తి చెడిపోకుండా నివారించుకోవచ్చు. ఎండ కాసిన తర్వాత ధాన్యాన్ని ఎండబెట్టి, తూర్పార పట్టి నిలువ చేసుకోవాలని ఏపీ వ్యవసాయ శాఖ సూచించింది.
News October 29, 2025
డౌన్స్ సిండ్రోమ్ పిల్లలకు ఈ పరీక్షలు చేయిస్తున్నారా?

డౌన్స్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించాలని వైద్యులు చెబుతున్నారు. ఏడాదికోసారి కంటి పరీక్షలు, 6-12 నెలలకు ఒకసారి చెవి పరీక్షలు చేయించాలి. ప్రతి ఆర్నెల్లకోసారి దంత పరీక్షలు, 3-5 ఏళ్లకోసారి ఛాతీ, మెడ భాగాన్ని ఎక్స్‌రే తీసి పరీక్షిస్తూ ఉండాలి. అమ్మాయిల్లో యుక్త వయసు రాగానే పాప్ స్మియర్ పరీక్ష, సంవత్సరానికోసారి థైరాయిడ్ పరీక్ష చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.


