News January 1, 2025

హరిహర వీరమల్లు అప్‌డేట్ వచ్చేసింది!

image

న్యూ ఇయర్ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ‘హరిహర వీరమల్లు’ టీమ్ అదిరే అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 6న ఉదయం 9.06 గంటలకు తొలి పాట ‘మాట వినాలి’ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని స్వయంగా పవన్ కళ్యాణే పాడటం విశేషం. తొలిభాగానికి పార్ట్-1 స్వోర్డ్ వెర్సస్ స్పిరిట్ అన్న ట్యాగ్‌లైన్ ఇచ్చారు. కీరవాణి సంగీతాన్నందిస్తున్న ఈ మూవీని జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు.

Similar News

News January 4, 2025

బ్రాహ్మణికి హీరోయిన్‌గా ఆఫర్: బాలకృష్ణ

image

అప్పట్లో మణిరత్నం ఓ సినిమా కోసం తన కుమార్తె బ్రాహ్మణికి హీరోయిన్‌గా ఆఫర్ ఇచ్చారని సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. కానీ ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించారని చెప్పారు. ఓ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అడిగిన ప్రశ్నలకు బాలయ్య సమాధానమిచ్చారు. బ్రాహ్మణి, తేజస్విని ఇద్దరినీ గారాబంగా పెంచానని పేర్కొన్నారు. ఎవరి రంగంలో వారు మంచి పేరు తెచ్చుకున్నారని చెప్పారు. తాను బ్రాహ్మణికి ఎక్కువగా భయపడతానని తెలిపారు.

News January 3, 2025

మార్కెట్లోకి రూ.5,000 నోట్లు.. క్లారిటీ

image

త్వరలో రూ.5,000 నోట్లు మార్కెట్లోకి రానున్నాయనే ప్రచారాన్ని RBI కొట్టిపారేసింది. అలాంటిదేమీ లేదని తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించింది. ప్రస్తుతం 10, 20, 50, 100, 200, 500 నోట్లే చలామణిలో ఉన్నాయని పేర్కొంది. దేశ ఆర్థిక అవసరాలను తీర్చేందుకు ప్రస్తుత కరెన్సీ వ్యవస్థ సరిపోతుందని చెప్పింది. ప్రభుత్వం కూడా డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజలూ ఆ దిశగానే మొగ్గు చూపుతున్నారని వెల్లడించింది.

News January 3, 2025

HMPV వ్యాప్తి తక్కువే: చైనా

image

చైనాలో కొత్తగా విస్తరిస్తోన్న <<15057647>>HMPV<<>>(Human metapneumovirus)పై ఆ దేశం స్పందించింది. దాని తీవ్రతను తక్కువచేసే ప్రయత్నం చేసింది. ‘ప్రతి వింటర్‌లో ఉత్తరార్ధగోళంలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే తక్కువ స్థాయిలోనే వ్యాప్తి ఉంది. చైనా పౌరులతో పాటు విదేశీయుల ఆరోగ్యంపై మేం శ్రద్ధ చూపిస్తాం. చైనాలో పర్యటించడం సురక్షితమే’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ తెలిపారు.