News September 1, 2025
యువత గుండె వయసు వేగంగా పెరుగుతోంది!

మిలీనియల్స్ (1981-96) & GenZ (1997-2012)లలో ‘కార్డియాక్ ఏజింగ్’ అభివృద్ధి చెందుతున్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే వారి గుండె సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందడం. అందుకే 50 ఏళ్లలో కనిపించే గుండె జబ్బులు 30 ఏళ్లలోపే చూస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేకపోవడం, స్క్రీన్ సమయం పెరగడం, ధూమపానం వంటివి ఇందుకు కారణమని తెలుస్తోంది.
Similar News
News September 4, 2025
ధవన్‌కు ఈడీ నోటీసులు

టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ శిఖర్ ధవన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై ఆయన్ను ప్రశ్నించనుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వ్యవహారంలో మాజీ క్రికెటర్ సురేశ్ రైనాను ఇప్పటికే ఈడీ ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే.
News September 4, 2025
NCC, డిగ్రీ అర్హతతో 70 లెఫ్టినెంట్ పోస్టులు

NCC సర్టిఫికెట్ ఉన్న పురుష అభ్యర్థులు స్పెషల్ ఎంట్రీ కింద 70 లెఫ్టినెంట్ ఉద్యోగాలకు ఈ నెల 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీసం 50 మార్కులతో డిగ్రీ పాసైన వారు అర్హులు. 19-25ఏళ్లలోపు వయసుండాలి. NCC, డిగ్రీ మార్కులు, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ సమయంలో నెలకు ₹56,100 స్టైఫండ్, విధుల్లో చేరిన తర్వాత ₹లక్షకు పైగా జీతం పొందొచ్చు.
వెబ్‌సైట్: <
News September 4, 2025
పిల్లలకు ఫార్ములా పాలు పడుతున్నారా?

డెలివరీ తర్వాత తల్లికి పాలు పడకపోయినా, పాలు పట్టలేని స్థితిలో ఉన్నా శిశువులకు ఫార్ములా పాలు ఇస్తుంటారు. వీటిని సరైన కొలతలతో, జాగ్రత్తగా పట్టాలి. ఒక స్పూన్ పాలపొడికి ఎన్ని నీళ్లు కలపాలో సరిగ్గా చెక్ చేసుకోవాలి. లేదంటే చిన్నారులకు ఆరోగ్య సమస్యలు వస్తాయి. పాలు కలిపిన వెంటనే వారికి పట్టించాలి. అలాగే వారు ఒకసారి కాస్త తాగి వదిలేసిన వాటిని మళ్లీ ఇవ్వకూడదు. కాచి చల్లార్చిన నీటితో మాత్రమే పాలు కలపాలి.