News March 19, 2024

సినిమా కోసం 30 కిలోల బరువు తగ్గిన హీరో

image

సినిమాల కోసం నటీనటులు తమని తాము పూర్తిగా మార్చేసుకుంటారు. తాజాగా బాలీవుడ్ హీరో రణదీప్ హుడా ట్రాన్స్‌ఫర్మేషన్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. తన కొత్త చిత్రం ‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ కోసం రణదీప్ ఏకంగా 30 కిలోల బరువు తగ్గారు. మూవీలో ఫ్రీడమ్ ఫైటర్ వినాయక్ దామోదర్ సావర్కర్ పాత్ర కోసం ఆయన ఇలా అయ్యారు. ఈ నెల 22న ఈ సినిమా రిలీజ్ కానుంది.

Similar News

News January 8, 2025

స్నానం ఆపేస్తే ఆయుష్షు 34% పెరుగుతుందా!

image

చలికాలంలో స్నానం చేయడం మానేస్తే జీవితకాలం 34% పెరుగుతుందనడంలో నిజం లేదని డాక్టర్లు చెప్తున్నారు. ఎప్పుడో ఒకసారి మానేస్తే ఫర్వాలేదంటున్నారు. చల్లదనం వల్ల అసలే మెటాబాలిజం తగ్గుతుందని, స్నానం ఆపేస్తే ఇంకా కష్టమని పేర్కొంటున్నారు. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం పెరిగి రిలాక్సేషన్ లభిస్తుందని చెప్తున్నారు. జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా బాడీ హైజీన్ పెంచుతుందని వెల్లడించారు.

News January 8, 2025

వాట్సాప్‌లో ‘ఫొటో పోల్స్’

image

వాట్సాప్ ‘ఫొటో పోల్స్’ ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా టెక్స్ట్‌తో అవసరం లేకుండా పోల్స్‌లో ఫొటోలను అటాచ్ చేసేందుకు వీలుంటుంది. ముందుగా ఛానల్స్‌లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్‌ను ఆ తర్వాత గ్రూప్ చాట్స్, పర్సనల్ చాట్స్‌లోనూ ప్రవేశపెడతారని వాట్సాప్ బీటా ఇన్ఫో వెల్లడించింది. టెక్స్ట్‌లో చెప్పలేని విషయాలను ఫొటోలతో ఈజీగా చెప్పేందుకు ఈ ఫీచర్ సాయపడనుందని పేర్కొంది.

News January 8, 2025

నేడు అక్కడ స్కూళ్లకు సెలవు

image

AP: ప్రధాని విశాఖ పర్యటన నేపథ్యంలో నేడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) పరిధిలోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు డీఈవో ప్రేమ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. బస్సుల కొరతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయంగా మరో రోజు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందన్నారు. నేడు సాయంత్రం మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విశాఖలో రోడ్ షో చేయనున్నారు.