News January 30, 2025

హీరోల గొడవ.. ఈ పార్ట్ సరిగా ప్లాన్ చేసుకోలేదా!

image

హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోనీల మధ్య టైటిల్స్ వివాదం నెలకొంది. విజయ్ తెలుగులో, శివ తెలుగు, తమిళ భాషల్లో ‘పరాశక్తి’ పేరుతో రానున్నారు. బిచ్చగాడు హీరో PARASHAKTHI స్పెల్లింగ్‌తో రిజిస్టర్ చేస్తే ‘డాక్టర్’ స్టార్ PARASAKTHI అని పేర్కొన్నారు. వేర్వేరు సినీ కౌన్సిళ్లలో భిన్న స్పెల్లింగుల కారణంగా ఈ వివాదం మొదలైంది. దీంతో కౌన్సిల్స్ బేసిక్ చెకింగ్స్ చేయాలి కదా అని సినీ జనాలు పెదవి విరుస్తున్నారు.

Similar News

News October 16, 2025

POLITICAL: ‘అచ్చంపేటకు ఆయన వస్తున్నారా?’

image

అచ్చంపేట మాజీ MLA గువ్వల బాలరాజు ఇటీవల BRSకు రాజీనామా చేసి BJPలో చేరిన విషయం తెలిసిందే. దీంతో అచ్చంపేట BRSకు సారథి లేరనే చర్చ నడుస్తోంది. అచ్చంపేట SC రిజర్వ్‌డ్ కావడంతో ఉమ్మడి పాలమూరు బిడ్డ, BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి RS ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి ఉంటారనే చర్చ నడుస్తోంది. కాగా 2024లో BRS తరఫున నాగర్‌కర్నూల్ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. అచ్చంపేటకు ఆయన వస్తారనే చర్చపై మీ కామెంట్?

News October 16, 2025

RNSBలో ఉద్యోగాలు

image

రాజ్‌కోట్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్(RNSB) జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి సడలింపు ఉంది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://rnsbindia.com/

News October 16, 2025

బిగ్‌బాస్ షోను నిలిపివేయాలని పోలీసులకు ఫిర్యాదు

image

TG: బిగ్‌బాస్ సమాజానికి, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశం ఇస్తోందని గజ్వేల్‌కు చెందిన యువకులు జూబ్లీహిల్స్ PSలో ఫిర్యాదు చేశారు. బిగ్‌బాస్ నిర్వాహకులు సమాజం సిగ్గు పడే విధంగా అభ్యంతరకరమైన కంటెంట్‌తో షో నిర్వహిస్తున్నారని, సమాజంలో విలువలు లేనివారిని ఎంపిక చేస్తున్నారని తెలిపారు. కర్ణాటక తరహాలో ఇక్కడా ఆ షోను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బిగ్‌బాస్ హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.