News August 23, 2024

ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న హీరోయిన్

image

సినీ హీరోయిన్ మేఘా ఆకాశ్ తన ప్రియుడు సాయి విష్ణుతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. సాయి విష్ణు గురించి, పెళ్లి తేదీ వివరాలు తెలియాల్సి ఉంది. 28 ఏళ్ల ఈ హీరోయిన్ తెలుగులో లై, చల్ మోహనరంగా, రావణాసుర, డియర్ మేఘ, మను చరిత్ర వంటి పలు సినిమాల్లో నటించారు.

Similar News

News November 7, 2025

NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

image

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>NEEPCO<<>>)లో 98 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ , బీటెక్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://neepco.co.in/

News November 7, 2025

వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

image

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.

News November 7, 2025

‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

image

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.