News April 11, 2025
నెగటివ్ ప్రచారంపై ఘాటుగా స్పందించిన హీరోయిన్

సోషల్ మీడియాలో నెగటివిటీని ప్రచారం చేసే వారికి ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుందని హీరోయిన్ త్రిష ఇన్‌స్టాలో ప్రశ్నించారు. ఖాళీగా కూర్చొని ఇతరులపై ఇష్టం వచ్చినట్లుగా పోస్టులు చేయడమే పనా అని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వారితో కలిసి జీవించేవారి గురించి ఆలోచిస్తే బాధగా అనిపిస్తుందన్నారు. నిన్న విడుదలైన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పకపోవడంతో SMలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి.
Similar News
News April 18, 2025
త్వరలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఇండియన్‌గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్‌శర్మ స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.
News April 18, 2025
చెత్త నుంచి సంపదతోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యం: సీఎం

AP: స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని CM చంద్రబాబు చెప్పారు. ‘ఈసారి e-వ్యర్థాల సేకరణ-సురక్షితంగా రీసైకిల్ చేయడమనే థీమ్‌ను ఎంచుకున్నాం. చెత్త నుంచి సంపద సృష్టితోనే సర్క్యులర్ ఎకానమీ సాధ్యమవుతుంది. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేది వ్యర్థాల సేకరణ కేంద్రాల నినాదం కావాలి. ఈ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలి’ అని ట్వీట్ చేశారు.
News April 18, 2025
UPI పేమెంట్స్‌పై GST.. క్లారిటీ

రూ.2వేలకు పైన చేసే UPI పేమెంట్స్‌పై కేంద్రం 18% GST విధించనున్నట్లు కొన్ని జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలపై కేంద్ర ఆర్థికశాఖ స్పందించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలేమీ లేవని స్పష్టం చేసింది.