News October 20, 2024

పుష్పశ్రీవాణి ఎస్టీనే అని తేల్చిన హైకోర్టు

image

AP: మాజీ మంత్రి పుష్పశ్రీవాణి ST కులానికి చెందిన వారేనని హైకోర్టు తీర్పునిచ్చినట్లు ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. DLSC కమిటీ రిపోర్ట్, స్టేట్ స్క్రూటినీ కమిటీ ఇచ్చిన జీవో 6ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషనర్ వద్ద ఆధారాలు లేవంటూ కేసు కొట్టివేసింది. కాగా ఆమె ST కాదంటూ ఇద్దరు వ్యక్తులు 2019లో పిటిషన్ వేశారు. ఓ వర్గం కావాలనే తప్పుడు ప్రచారం చేసిందని, చివరకు న్యాయమే గెలిచిందని పుష్పశ్రీవాణి అన్నారు.

Similar News

News October 20, 2024

‘వార్-2’ తెలుగు టైటిల్ ఇదేనా?

image

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ‘వార్-2’. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు తెలుగులో ‘యుద్ధ భూమి’ టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే పేరును చిత్రయూనిట్ రిజిస్టర్ చేయించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

News October 20, 2024

ఫార్మసీ సీట్ల భర్తీకి గ్రీన్ సిగ్నల్

image

AP: రాష్ట్రంలో బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. దీంతో ఫార్మసీ విద్యా సంస్థల్లో సీట్ల భర్తీకి ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 92 విద్యాసంస్థల్లో సీట్లను భర్తీ చేసేందుకు సాంకేతిక విద్యాశాఖ షెడ్యూల్ విడుదల చేయనుంది. కాగా రాష్ట్రంలో సుమారు 12 వేల ఫార్మా సీట్లు అందుబాటులో ఉన్నాయి.

News October 20, 2024

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామి వారి దర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 6 గంటల సమయం పడుతోంది. 5 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 80,741 మంది భక్తులు దర్శించుకోగా, 31,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. అదే సమయంలో స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లు సమకూరింది.