News July 30, 2024
పవన్ కళ్యాణ్ మీద నమోదైన కేసుపై హైకోర్టు స్టే

AP: వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పవన్ కళ్యాణ్ మీద గుంటూరులో నమోదైన కేసు విచారణలో హైకోర్టు స్టే విధించింది. ఈ కేసును క్వాష్ చేయాలని పవన్ తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనితో పాటు ఇలాంటి మరికొన్ని కేసులపై ప్రభుత్వం రివిజన్ చేస్తోందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో కేసు విచారణలో హైకోర్టు స్టే విధించింది. క్వాష్ పిటిషన్పై విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
Similar News
News December 9, 2025
గద్వాల్: 10, 11 తేదీల్లో పాఠశాలలకు సెలవు

గద్వాల్ జిల్లాలో మొదటి విడుత పంచాయతీ ఎన్నికలు జరిగే గట్టు, గద్వాల్, కేటిదొడ్డి, ధరూర్ మండలాల్లోని పాఠశాలలకు డిసెంబర్ 10, 11 తేదీల్లో సెలవు ప్రకటించారు. ఈ నెల 11న జరగనున్న మొదటి విడుత ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ సెలవు ఇస్తున్నట్లు డీఈఓ విజయలక్ష్మీ తెలిపారు. నేటితో గ్రామాల్లో మైకులు మూగబోనున్నాయి.
News December 9, 2025
ఒట్టేసి చెప్పు.. ఓటేస్తానని..!

TG: పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను అభ్యర్థులు ప్రలోభాలకు గురిచేస్తున్నారు. రాత్రుళ్లు పార్టీలు ఇస్తుండటంతో పాటు సిటీలో ఉద్యోగం చేసే వారికి కాల్ చేసి ఛార్జీలు ఇస్తాం రమ్మంటూ ఆఫర్ చేస్తున్నారు. అటు దండాలు పెడుతూ, కాళ్లు మొక్కుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. పలు చోట్ల పిల్లలు, దేవుడిపై ఒట్లు వేయించుకొని మాట తీసుకుంటున్నారు. ఇతర అభ్యర్థులపై నిఘా పెట్టి వారికి పోటీగా ప్రమాణాలు చేస్తున్నారు, చేయిస్తున్నారు.
News December 9, 2025
నేడు పార్లమెంటులో SIRపై చర్చ

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈసీ నిర్వహిస్తోన్న SIRపై ఇవాళ లోక్సభలో 10 గంటలపాటు చర్చ జరగనుంది. 12PMకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చను ప్రారంభిస్తారు. సభ్యుల ప్రసంగాల తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానం ఇస్తారు. కాగా ఓట్ల చోరీ, ఎన్నికల కమిషన్ విధానాలు, BLOల ఆత్మహత్యలపై రాహుల్ ప్రశ్నించే అవకాశం ఉంది. సమగ్ర చర్చకు తాము సిద్ధమేనని ఎన్డీఏ కూడా చెబుతోంది.


