News March 29, 2024

పంతం నెగ్గించుకున్న గంటా

image

AP: మొదటి నుంచి భీమిలి సీటు కోసం పట్టుబడుతున్న గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయనను చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దింపాలని TDP భావించగా గంటా ససేమీరా అన్నారు. అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయి చర్చించిన ఆయన.. చివరకు భీమిలి సీటును కన్ఫార్మ్ చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ఓటమెరుగని నేతగా ఉన్న శ్రీనివాసరావు ఈసారి భీమిలిలో పసుపు జెండా రెపరెపలాడిస్తారో? లేదో చూడాలి.

Similar News

News March 28, 2026

నిహారిక నిర్మాతగా వరుణ్ తేజ్ ‘బరి’

image

వరుణ్ తేజ్ తన తర్వాతి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ యదు వంశీతో చేయనున్నారు. ‘బరి’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ పల్లెటూరి నేపథ్యంలో సాగే వాలీబాల్ స్పోర్ట్స్ డ్రామా. వరుణ్ తేజ్ సోదరి నిహారిక కొణిదెల దీన్ని నిర్మిస్తుండటం విశేషం. పవన్ ముఖ్య అతిథిగా నేడు పూజా కార్యక్రమం జరగనుంది. 2027 సంక్రాంతి రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. సినిమా స్టోరీని వివరించడానికి AI వీడియోను యూనిట్ ప్లాన్ చేస్తోంది.

News March 28, 2026

నో టెన్షన్.. బంకుల్లో తగ్గిన రద్దీ

image

TG: హైదరాబాద్‌లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తగ్గింది. 3-4 రోజులుగా విపరీతమైన రద్దీతో బంకుల వద్ద గందరగోళం నెలకొంది. అయితే సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, ఆందోళన చెందవద్దని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగా సరఫరా చేయడంతో ఎట్టకేలకు ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అటు ఆయిల్ కంపెనీలు సైతం క్రెడిట్ రద్దు నిర్ణయాన్ని తాత్కాలికంగా విరమించుకున్నట్లు సమాచారం.

News March 28, 2026

విశాఖలో గూగుల్ డేటా సెంటర్.. ఏప్రిల్‌లో భూమి పూజ?

image

AP: విశాఖలో గూగుల్ మెగా డేటా సెంటర్ ఏర్పాటుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. నిర్మాణ అనుమతుల కోసం బిల్డింగ్ ప్లాన్‌ను సంస్థ ప్రభుత్వానికి సమర్పించింది. పర్యావరణానికి నష్టం లేకుండా చెరువులు, నీటి కుంటలను యథాతథంగా ఉంచుతూ అభివృద్ధి చేస్తామని తెలిపింది. అనుమతులు రాగానే ఏప్రిల్‌లో భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో 601 ఎకరాలను కేటాయించింది.