News January 2, 2025
సీఎం అధికారిక నివాసంగా ఉండవల్లి గృహం
AP: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గృహాన్ని సీఎం చంద్రబాబు అధికారిక నివాసంగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 జూన్ 12 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొంది. 2017 నుంచి 2019 వరకు కూడా సీఎం హోదాలో చంద్రబాబు అక్కడే నివాసం ఉన్నారు. అయితే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఆ నిర్మాణం అక్రమమని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News January 4, 2025
తెలుగులో ఉత్తర్వులతో పాలన పారదర్శకం: మంత్రులు
AP: ప్రభుత్వ ఉత్తర్వులను <<15057376>>తెలుగులోనూ<<>> ఇవ్వాలన్న నిర్ణయంపై మంత్రులు అచ్చెన్న, సత్యప్రసాద్, రామ్ ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. 90% మంది తెలుగు మాట్లాడే ప్రజలున్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా పరిపాలన పారదర్శకంగా మారనుందని తెలిపారు. తెలుగు భాషకు CM సముచిత గౌరవం ఇస్తున్నారని కొనియాడారు. మాతృభాషను గత ప్రభుత్వం అవమానించిందని మండిపడ్డారు.
News January 4, 2025
చాహల్, ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నారా?
భారత క్రికెటర్ చాహల్, ఆయన భార్య ధనశ్రీ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, తన భార్యతో ఉన్న ఫొటోలను చాహల్ డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది. విడాకుల విషయాన్ని వారి సన్నిహితులు ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని సమాచారం. దీనిపై చాహల్, ధనశ్రీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. వీరికి 2020లో వివాహమైంది.
News January 4, 2025
బుమ్రా బౌలింగ్‌పై రేపు నిర్ణయం!
మ్యాచ్ మధ్యలో బుమ్రా స్కానింగ్‌కి వెళ్లడంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అతను వెన్నునొప్పితో బాధపడుతున్నారని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ తెలిపారు. స్కానింగ్ తర్వాత బుమ్రా పరిగెత్తుతూ మెట్లెక్కి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లడం చూస్తే పెద్దగాయం కాలేదని తెలుస్తోంది. 2వ ఇన్నింగ్స్‌లో బుమ్రా బ్యాటింగ్ చేస్తారని, బౌలింగ్‌పై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.