News March 19, 2024
రూ.వేలకోట్ల నిధులు ఉన్న షిప్పు కోసం వేట మొదలైంది..!

‘ఎల్ డొరాడో ఆఫ్ ది సీస్’గా పిలిచే బ్రిటన్ నౌక ‘ది మర్చంట్ రాయల్’ ఆచూకీ కోసం మళ్లీ అన్వేషణ మొదలైంది. బంగారం, వెండి నిధులను తరలిస్తుండగా 1641 సెప్టెంబరు 23న కార్న్వాల్ తీరాన ఈ నౌక నీట మునిగింది. అప్పుడు షిప్పులోని నిధుల విలువ రూ.42వేల కోట్లని అంచనా. దీని ఆచూకీ కోసం ఎంతోమంది విఫలయత్నం చేశారు. తాజాగా మల్టీబీమ్ సర్వీసెస్ సంస్థ సోనార్ టెక్నాలజీ, మానవరహిత సబ్మెరైన్లతో అన్వేషణ చేపట్టేందుకు సిద్ధమైంది.
Similar News
News April 4, 2025
బాబు వచ్చాక ఆదాయం తగ్గింది: వైసీపీ

AP: చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల శాఖ నేల చూపులు చూస్తోందని వైసీపీ విమర్శించింది. ‘జగన్ హయాంతో పోలిస్తే నేడు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చే ఆదాయం భారీగా తగ్గిపోయింది. దీంతో ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. 2023-24లో రూ.9,600కోట్లు రాగా, 2024-25లో రూ.8,800కోట్లకు పడిపోయింది. అది రాబట్టడానికి అధికారులు అష్టకష్టాలు పడ్డారు’ అని ట్వీట్ చేసింది.
News April 4, 2025
నేరుగా OTTలోకి కొత్త సినిమా

మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్’ సినిమా OTTలో విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా మార్చిందనే స్టోరీ లైన్తో ఈ స్పోర్ట్ డ్రామా రూపొందింది.
News April 4, 2025
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు: BRS నేత

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.