News August 24, 2024
ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దన్న భర్త.. కేసు పెట్టిన భార్య

ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దని చెప్పిన భర్తపై భార్య ఏకంగా IPC 498ఏ సెక్షన్ కింద గృహహింస కేసు పెట్టింది. దీంతో ఆ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. విచారణ చేపట్టిన జడ్జి నాగప్రసన్న మాట్లాడుతూ ఇలా కేసు పెట్టడం చట్టాలను దుర్వినియోగం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. భర్తపై చర్యలు తీసుకుంటే న్యాయ ప్రక్రియను అపహాస్యం చేసినట్లే అవుతుందన్నారు. ఈ కేసుపై స్టేటస్ కో విధించారు.
Similar News
News February 23, 2026
కల్తీ పాల బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: జగన్

AP: రాజమండ్రి కల్తీ పాల <<19213441>>ఘటనపై<<>> మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహార భద్రతపై నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిందని జగన్ పేర్కొన్నారు. కాగా కల్తీ పాల ఘటనపై CM చంద్రబాబు ఇప్పటికే కఠిన <<19215266>>చర్యలకు<<>> ఆదేశించారు.
News February 23, 2026
మొలతాడు గురించి మీకు ఈ కథ తెలుసా?

మొలతాడుధారణ వెనుక ఓ పురాణ కథ ఉంది. కృష్ణుడి వరంతో ఉదంక మహర్షికి అమృతం ఇవ్వడానికి ఇంద్రుడు చండాలుడి రూపంలో వచ్చాడు. అమృత భాండాన్ని తన నాభి దిగువన మొలతాడుకు కట్టుకుని తెచ్చాడు. నాభి కింద భాగం అపవిత్రమని భావించిన రుషి దానిని నిరాకరించాడు. ఈ ఘటన ద్వారా శరీరాన్ని ఊర్థ్వ, అథో భాగాలుగా విభజించే సూచీ రేఖగా మొలతాడు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇది క్రమశిక్షణకు, పవిత్రతకు చిహ్నంగా మారింది.
News February 23, 2026
APPLY NOW: ఇండియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు

<


