News March 23, 2024
బాంబు పేలుడు కేసులో నిందితుడి గుర్తింపు

బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించారు. నిందితుడు ముస్సావిర్ షాజిబ్‌గా తేల్చారు. అతడు కర్ణాటకలోని శివమొగ్గకు చెందినవాడని తెలిపారు. పేలుడు అనంతరం చెన్నైలో స్నేహితుడితో కలిసి ఉంటున్నాడని పోలీసులు గుర్తించారు. స్నేహితుడు కూడా తమిళనాడులోని ఓ హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ ముద్దాయని తెలిపారు. మార్చి 1న బాంబు పేలుడు జరగ్గా ఈ కేసును NIA దర్యాప్తు చేస్తోంది.
Similar News
News April 19, 2025
CBN బర్త్ డే.. CDP రిలీజ్ చేసిన మంత్రి లోకేశ్

రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బర్త్ డే. ఈ సందర్భంగా ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్ కామన్ డీపీని విడుదల చేశారు. ఫొటోలో పోలవరం ప్రాజెక్టు, ఏపీ సచివాలయం, ఎంఎంటీఎస్ రైళ్లు, సైబర్ టవర్స్, కియా ఫ్యాక్టరీ, అన్న క్యాంటిన్, బుద్ధ వనాలను చూపించారు. అలాగే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి మల్టీనేషనల్ కంపెనీలను ఆకర్షించడంలో చంద్రబాబు కీలకం అని తెలిపేలా CDPని రూపొందించారు.
News April 19, 2025
టైట్ డ్రెస్‌లు వేసుకుంటే..

టైట్‌గా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల నడుము, కాళ్ల వద్ద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. కాబట్టి వాపు రావడం, రక్తం గడ్డకట్టడం లాంటివి జరుగుతాయి. పలు రకాలైన చర్మ సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఆడవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. నరాల సమస్యతో పాటు గ్యాస్ట్రిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News April 19, 2025
ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్‌లో పడ్డట్లే..

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.