News January 24, 2025
భార్యను ముక్కలుగా నరికిన ఘటన.. పిల్లలు ఏం చెప్పారంటే?
TG: మీర్పేట్కు చెందిన మాధవి హత్య కేసుపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో మాధవి ఇద్దరు పిల్లల స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. తమ తల్లి కనిపించకుండా పోయిన తర్వాత ఇంట్లో చెడు వాసన వచ్చినట్లు వారు పోలీసులకు తెలిపారు. అమ్మ ఎక్కడా అని అడిగితే నాన్న మౌనంగా ఉన్నాడని చెప్పారు. మరోవైపు నిందితుడు చెప్పిన విషయాలపైనే కాకుండా పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 24, 2025
‘పతంజలి’ కారం పొడి కొన్నారా?
పతంజలి ఫుడ్స్ కంపెనీ AJD2400012 బ్యాచ్ నంబర్ కలిగిన 4 టన్నుల కారం పొడి ప్యాకెట్లను (200gms) రీకాల్ చేసింది. ఆ కారం ఆహార భద్రతా ప్రమాణాలకు లోబడి లేదని, వాటిలో క్రిమిసంహారకాలు మోతాదుకు మించి ఉన్నాయని సంస్థ సీఈఓ తెలిపారు. FSSAI ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్యాకెట్లను వినియోగదారులు ఎక్కడ కొన్నారో అక్కడే తిరిగి ఇచ్చేయాలని, మనీ రీఫండ్ చేస్తారని చెప్పారు.
News January 24, 2025
హరీశ్ రావు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు: మంత్రి ఉత్తమ్
TG: ఏపీ ప్రాజెక్టులకు అనుమతుల ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాము ఇప్పటికే కేంద్రానికి లేఖలు రాసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే నదీ జలాల్లో నష్టం జరిగిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మన జలాలను కేసీఆర్ హయాంలోనే ఏపీ ఎత్తుకెళ్లిందని విమర్శించారు. <<15245846>>హరీశ్ రావు<<>> పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.
News January 24, 2025
రిపబ్లిక్ డే.. విద్యుత్ వెలుగుల్లో సచివాలయం
AP: గణతంత్ర దినోత్సవ వేళ అసెంబ్లీ, సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఈ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించడంతో వెలుగులు విరజిమ్ముతున్నాయి. సచివాలయం ప్రధాన ప్రవేశ మార్గానికి సమీపంలోని ఐదో భవనంపై మువ్వన్నెల జాతీయ జెండా నమూనా ఆకట్టుకుంటోంది.