News July 2, 2024
టారిఫ్‌ల పెంపు.. మనపై భారమెంత?

జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు తమ టారిఫ్‌లను సగటున 10%-25% పెంచాయి. అంటే వినియోగదారుడు నెలకు సగటున రూ.50 అదనంగా భరించాల్సి వస్తుంది. జియో, వొడాఫోన్ ఐడియాలు వాయిస్ ఓన్లీ ప్లాన్ల టారిఫ్‌లను మార్చలేదు. ఎయిర్‌టెల్ మాత్రం పెంచింది. దీనివల్ల ఎయిర్‌టెల్ యూజర్లు కాస్త ఎక్కువగా ఛార్జీలు భరించాల్సి ఉంటుంది. ఒక విడత అదనపు ఛార్జీ తగ్గాలంటే ఈరోజే రీఛార్జ్ చేసుకోండి. ఈ పెంపు జులై 3 నుంచి అమలవుతుంది.
Similar News
News December 1, 2025
రైతు సమస్యలపై పార్లమెంట్‌లో గళమెత్తుతా: ఏలూరు ఎంపీ

పార్లమెంట్ శీతాకాలం సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు విషయాలను ఆయన పార్లమెంట్లో ప్రస్తావిస్తారని తెలుస్తుంది. ప్రధానంగా రైతుల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టుల పనులు పూర్తి, అలాగే ఇటీవల ఏలూరు-జంగారెడ్డిగూడెం రహదారిని నాలుగు లైన్ల రహదారిగా మార్చేందుకు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తానని ఆయన తెలిపారు.
News December 1, 2025
కాసేపట్లో వాయుగుండంగా బలహీనపడనున్న ‘దిత్వా’

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. రేపటి వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
News December 1, 2025
ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో ఉద్యోగాలు

ఎయిమ్స్ రాజ్‌కోట్‌లో 6 NHMS ఫీల్డ్ డేటా కలెక్టర్ల పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పీజీ(మాస్టర్ ఆఫ్ సైకాలజీ/సోషల్ వర్క్/సోషియాలజీ/రూరల్ డెవలప్‌మెంట్)అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3వరకు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 4న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నెలకు రూ.45వేలు జీతం చెల్లిస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు. వెబ్‌సైట్: https://aiimsrajkot.edu.in/


