News March 22, 2025

నేటి నుంచే ఐపీఎల్ మహాసంగ్రామం

image

నేటి నుంచి మహాసంగ్రామానికి తెరలేవనుంది. క్రికెట్ అభిమానులు పండగలా భావించే ఐపీఎల్ ఇవాళ ప్రారంభం కానుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే తొలి మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్, ఆర్సీబీ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్‌, జియో హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. ఈ సీజన్‌లో తలపడే 10 జట్లలో విజేతగా ఏ టీమ్ నిలుస్తుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి?

Similar News

News February 4, 2026

కరివేపాకు సాగు.. పొలం తయారీ, నాటే విధానం

image

కరివేపాకు సాగు చేయదలచే రైతులు విత్తనాన్ని నేరుగా భూమిలో నాటడం వల్ల మొక్క పెరుగుదలలో లోపాలు రావొచ్చు. దీనికి బదులు 1 నుంచి 1.5 సంవత్సరాల మొక్కలను వర్షాకాలంలో నాటితే మంచి ఫలితాలు పొందొచ్చు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దుక్కివచ్చే వరకు దున్నాలి. 45X45X45 సెం.మీ గుంతలను 1X1 మీటర్ల దూరంలో తీయాలి. ప్రతి గుంతకు పశువుల ఎరువు 10 కిలోల చొప్పున వేయాలి. ఒక హెక్టారుకు 10వేల మొక్కలను నాటుకోవచ్చు.

News February 4, 2026

154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 154 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు FEB 18 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, టెన్త్, ఇంటర్, ITI, డిప్లొమా, MLT, BE/BTech, MSc, MA/MSW, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ/స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.becil.com

News February 4, 2026

వచ్చే నెలలోనే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల

image

డైరెక్టర్ హరీశ్ శంకర్-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.