News August 2, 2024
సుప్రీం తీర్పుతో తెరపైకి OBC వర్గీకరణ అంశం

SC, ST వర్గీకరణపై సుప్రీం <<13751609>>తీర్పుతో<<>> OBC ఉప కులాల వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది. OBCల్లో వర్గీకరణపై 2017లో ఏర్పాటైన జస్టిస్ రోహిణీ కమిషన్ గతేడాది రాష్ట్రపతికి నివేదిక ఇచ్చినా, ఏ కారణంతోనో కేంద్రం దానిని బయటపెట్టలేదు. OBCల్లోనూ కొన్ని కులాలకే ప్రయోజనాలు దక్కాయనే వాదనలు ఉన్నాయి. 27% రిజర్వేషన్లను అందులోని ఇతర ఉపకులాలకూ సమంగా పంచాలనే డిమాండ్ ఉంది. తాజా తీర్పుతో OBCల వర్గీకరణపై ఏం జరుగుతుందో చూడాలి.
Similar News
News March 10, 2026
ఫైనల్లో గొడవ.. అర్ష్‌దీప్‌కు ICC ఫైన్

T20 WC ఫైనల్లో కివీస్ బ్యాటర్ మిచెల్‌పైకి బంతి విసిరిన ఘటనలో భారత బౌలర్ అర్ష్‌దీప్‌పై ICC చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 15శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అర్ష్‌దీప్ ICC ప్రవర్తనా నియమావళి లెవెల్-1 ఉల్లంఘించారని పేర్కొంది. కాగా ఫైనల్ మ్యాచులో మిచెల్ స్ట్రైట్ డ్రైవ్ ఆడగా అర్ష్‌దీప్ బంతి అందుకొని అతడిపైకి విసిరేయడంతో <<19332640>>గొడవ<<>> జరిగింది. తర్వాత మిచెల్‌కు అర్ష్‌దీప్ క్షమాపణ చెప్పారు.
News March 10, 2026
FDI రూల్స్ సడలించిన కేంద్రం

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం 2020లో తెచ్చిన రూల్స్‌ను సవరించినట్లు తెలుస్తోంది. పాత రూల్‌లో చైనా సహా భారత్‌తో సరిహద్దు పంచుకున్న దేశాల సంస్థలు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే కేంద్రం అనుమతి ఉండాల్సిందే. ఇతర విదేశీ సంస్థలైనా సరే వాటిలో ఈ దేశాల వాటా ఉంటే ఈ రూల్ వర్తిస్తుంది. చైనాతో ఉద్రిక్తతలు, దేశ భద్రత దృష్ట్యా గతంలో ఈ నిబంధన తెచ్చింది. తాజాగా ఈ నిబంధన మార్చింది.
News March 10, 2026
ఈనెల 13న పీఎం కిసాన్ నిధులు విడుదల

పీఎం కిసాన్ పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 13న 22వ విడత డబ్బులను అర్హులైన రైతుల అకౌంట్లలో జమ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రధాని మోదీ అస్సాం పర్యటనలో ఈ డబ్బులు రిలీజ్ చేయనున్నారు. దీని వల్ల 9.32 కోట్ల మంది రైతులకు లబ్ధి కలగనుంది. 2019 నుంచి కేంద్రం ఏటా 3 విడతల్లో రూ.2వేల చొప్పున మొత్తం రూ.6వేలను పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది.


