News June 4, 2024

జనసేన జెండా ఎగిరింది

image

ఏపీలో జనసేన బోణీ కొట్టింది. రెండు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తూర్పు గోదావరి జిల్లా రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ 34,048 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. అటు భీమవరంలోనూ జనసేన జెండా ఎగిరింది.

Similar News

News October 28, 2025

రూ.765 కోట్లతో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ

image

AP: ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంపోనెంట్ పథకం కింద రాష్ట్రంలో రూ.765 కోట్లతో ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకానుంది. దీంతో దాదాపు 955 మందికి ఉపాధి లభించనుంది. 3 రాష్ట్రాల్లో రూ.5,500 కోట్ల పెట్టుబడులతో 7 ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి ద్వారా రూ.36,559 కోట్ల విలువైన ఉత్పత్తుల తయారీ, 5,100 మందికి ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

News October 28, 2025

జీవితమంతా యోగసాధనలోనే..

image

యోగాతోనే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన నానమ్మల్ అనేక పురాతన యోగా శాసనాలను భావితరాలకు పంచారు. 1972లో యోగాసెంటర్‌ ప్రారంభించి 10L మందికిపైగా యోగా నేర్పారు. వారు దేశవిదేశాల్లో యోగాగురువులుగా స్థిరపడ్డారు. ఆమె చేసిన కృషికిగాను 2016లో కేంద్ర ప్రభుత్వం నారీశక్తి, 2019లో పద్మశ్రీతో సత్కరించింది. 99 ఏళ్ల వయసులో మరణించిన ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
✍️ మరిన్ని స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> కేటగిరీ.

News October 28, 2025

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీలో ఉద్యోగాలు

image

బాండా వర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ & టెక్నాలజీ 38 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.V.SC, PhDతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 11వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీతో పాటు డాక్యుమెంట్స్‌ను స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. టీచింగ్ స్కిల్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: buat.edu.in/