News March 3, 2025

కుంభమేళా పూర్తయ్యింది.. ప్రయాగ్‌రాజ్ పరిస్థితి ఇదీ

image

కుంభమేళా ముగిసి రోజులు గడుస్తున్నాయి. ఎటు చూసినా భక్తజనం, భగవన్నామస్మరణం, వ్యాపారాలు, రంగులతో 2నెలల పాటు సందడిగా కళకళలాడిన ప్రయాగ్‌రాజ్‌లో నేడు నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. శుభ్రం చేసేందుకు చెమటోడుస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మాత్రమే కనిపిస్తున్నారు. అక్కడ సేకరించిన చెత్తనంతా రీసైక్లింగ్ ప్లాంట్‌కు తరలించనున్నట్లు UP ప్రకటించింది. ప్రయాగ పరిస్థితిని పైన ఫొటోల్లో చూడొచ్చు.

Similar News

News March 4, 2025

క్రికెట్ అంటే తెలియనివాళ్లు ఇలా మాట్లాడటం విడ్డూరం: భజ్జీ

image

రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత షామా మహమ్మద్ బాడీ షేమింగ్ కామెంట్స్ దురదృష్టకరమని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అన్నారు. క్రికెట్ తెలియనివారు కూడా ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు. క్రీడాకారులకూ ఎమోషన్స్, సెంటిమెంట్లు ఉంటాయని, ఇలాంటి కామెంట్స్ ఎంత బాధిస్తాయో తెలుసుకోవాలని హితవు పలికారు. రోహిత్ అద్భుతమైన ప్లేయర్‌ అని, గొప్ప నాయకుడని భజ్జీ కొనియాడారు.

News March 4, 2025

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి

image

ముంబై లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్(84) కన్నుమూశారు. వృద్ధాప్యంతో ఆయన తుది శ్వాస విడిచారు. 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ఆయన 589 వికెట్లు పడగొట్టారు. పదకొండు సార్లు 10 వికెట్ల ఘనత సాధించారు. 12 లిస్ట్-ఎ మ్యాచ్‌లు ఆడిన పద్మాకర్ 16 వికెట్లు తీశారు. 2017లో సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.

News March 3, 2025

ఆత్మహత్య చేసుకుంటా.. సుప్రీం కోర్టుకు లాయర్ బెదిరింపు

image

తాను వాదిస్తున్న కేసులో పిటిషన్‌ను విచారణకు తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఓ న్యాయవాది ఏకంగా సుప్రీం కోర్టునే బెదిరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణ జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం ఈ నెల 7లోపు తమకు లిఖితపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. లేని పక్షంలో బార్ లైసెన్స్ రద్దు చేసి అరెస్టు చేయిస్తామని తేల్చిచెప్పింది.

error: Content is protected !!