News May 30, 2024
ఆ ఊరిలో ఆఖరి వ్యక్తి మృతి

తమిళనాడులోని మీనాక్షిపురం గ్రామంలో ఏకైక నివాసి కందసామి నాయకర్(73) మరణించారు. దీంతో ఆ ఊరు దెయ్యాల గ్రామంగా మారింది. 2001లో 1,296 మందితో ఊరు కళకళలాడేది. అస్థిర వర్షాలు, తీవ్రమైన కరవు కారణంగా ఆ గ్రామాన్ని విడిచి అందరూ వలసవెళ్లారు. కందసామి మాత్రం తన భార్యతో 20ఏళ్లు అక్కడే ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోగా ఇప్పుడు కందస్వామి కన్నుమూశారు. దీంతో గ్రామం ఖాళీ అయ్యింది.
Similar News
News April 9, 2026
HYDలో మరోసారి ‘టెడ్ ఎక్స్’

HYD మరోసారి ‘టెడ్ ఎక్స్’ సందడి మొదలైంది. ఏప్రిల్ 19న గండిపేట అక్షయ కన్వెన్షన్‌లో ‘ఫైర్-అప్’ థీమ్‌తో ఈ సదస్సు జరగనుంది. ఛోటా భీమ్ సృష్టికర్త రాజీవ్ చిలక, స్పర్ష్ హోస్పైస్ ఫౌండర్ సుబ్రహ్మణ్యం, కార్డియాలజిస్ట్ సోమరాజు వంటి దిగ్గజాలు తమ సక్సెస్ మంత్రం చెప్పబోతున్నారు. కేవలం మాటలే కాదు, మార్పు దిశగా అడుగులేయడమే ఈ వేదిక లక్ష్యం. ఆసక్తి ఉన్నవారు వెంటనే www.tedxhyderabad.comలో టికెట్లు బుక్ చేసుకోండి.
News April 9, 2026
పంచ్ అదిరింది.. భారత్‌కు పతకాల పంట!

ఏషియన్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. మంగోలియాలో జరిగిన ఫైనల్స్‌లో మీనాక్షి హుడా (48kg కేటగిరీ), ప్రీతి పవార్ (54kg), ప్రియ (60kg), అరుంధతి చౌదరీ (70kg) స్వర్ణం సాధించారు. ఇప్పటివరకు ఉమెన్స్ టీమ్ మొత్తం 10 పతకాలు (గోల్డ్-4, సిల్వర్-2, బ్రాంజ్-4) సాధించింది. ఇక శుక్రవారం మెన్స్ కేటగిరీలో విశ్వనాథ్ సురేశ్ (56kg), సచిన్ సివాల్ (60kg) ఫైనల్స్‌లో పాల్గొంటారు.
News April 9, 2026
5th క్లాస్ ఎగ్జామ్‌లో దిమ్మతిరిగే ప్రశ్న!

AP: పోటీ పరీక్షల ప్రశ్నల తరహా క్వశ్చన్ 5వ తరగతి స్టూడెంట్స్‌ను విస్మయానికి గురి చేసింది. ఇవాళ వాళ్లు రాసిన SA2 ఎన్విరాన్మెంట్ సైన్స్ పరీక్షలో వచ్చిన కఠినమైన ప్రశ్న(2వ స్లైడ్) చూసి విద్యార్థుల దిమ్మతిరిగింది. క్వశ్చన్ చూసి టీచర్లూ అవాక్కయ్యారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలకు ప్రభుత్వ మద్దతు అవసరం అనే స్టేట్మెంట్‌కు ఆన్సర్ గుర్తించడం ఆ స్టాండర్డ్ విద్యార్థులకు కష్టంగా మారింది. దీనిపై మీ COMMENT.


