News April 12, 2025
పాఠ్యాంశాల్లో ‘వనజీవి’ జీవిత కథ

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.
Similar News
News January 25, 2026
కళ్లు ఇలా ఉంటే కిడ్నీ సమస్యలు!

కళ్లు ఎర్రబడటం, అలసట, ఎలర్జీ, ఇన్ఫెక్షన్ కిడ్నీ సమస్యలను సూచిస్తాయని నిపుణులు చెబుతున్నారు. బ్లూ, ఎల్లో రంగులను సరిగ్గా గుర్తించలేవు. డబుల్, బ్లర్ విజన్, దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బందులు కలుగుతాయి. కళ్లు పొడిబారడం, దురద సమస్యలు ఎదురవుతాయి. యూరిన్‌లో ప్రొటీన్ లీకై కళ్ల చుట్టూ ద్రవం పేరుకుపోయి ఉబ్బినట్టు కనిపిస్తాయి. యూరిన్‌లో నురుగు లేదా బుడగలు ఉన్నా కిడ్నీల పనితీరు సరిగ్గా లేదని గుర్తించాలి.
News January 25, 2026
విడాకులు తీసుకున్న సీరియల్ నటులు

టీవీ సీరియల్ కపుల్ అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్ విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని అనూష IGలో తెలియజేశారు. పరస్పర అంగీకారంతో తాము చట్టపరంగా 2025లోనే విడిపోయామని తాజా పోస్టులో పేర్కొన్నారు. శశిరేఖ పరిణయం, కుంకుమ పువ్వు, తేనె మనసులు తదితర సీరియల్స్‌లో ప్రతాప్ నటించారు. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అనూషతో కలిసి నటించారు. ఆ సమయంలోనే లవ్‌లో పడ్డారు. 2020లోనే పెళ్లి చేసుకోగా 2023 నుంచి వేరుగా ఉంటున్నారు.
News January 25, 2026
BRSలో గెలిచా.. కాంగ్రెస్‌తో పనిచేస్తున్నా: కడియం

TG: ఎమ్మెల్యేల అనర్హతపై వివాదం కొనసాగుతున్న వేళ స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచినా నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్‌తో పనిచేస్తున్నట్లు తెలిపారు. ‘ఎన్నికల్లో ఏ పార్టీకి ప్రచారం చేస్తారని అంతా అడుగుతున్నారు. నేను కాంగ్రెస్‌కే ఓటు వేయాలని చెబుతా. రేవంత్ ఐదేళ్లు సీఎంగా ఉంటారు. ఆయనకు ఎమ్మెల్యేలతోపాటు ప్రజల సపోర్టు ఉంది’ అని చెప్పారు.


