News July 11, 2024

భారతీయుడు-2 సినిమాకు లైన్ క్లియర్

image

భారతీయుడు-2 సినిమాకు మధురై జిల్లా కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమని పిటిషనర్ రాజేంద్రన్‌కు స్పష్టం చేసింది. మర్మకళపై తాను రాసిన పుస్తకం ఆధారంగా మూవీలో సీన్లు తీశారని రాజేంద్రన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా పార్ట్-1లోని సన్నివేశాలనే కొనసాగించామని నిర్మాతలు కోర్టుకి తెలిపారు. వాదనల అనంతరం రాజేంద్రన్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

Similar News

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 23, 2025

రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్‌గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.