News November 15, 2024
‘లాంగెస్ట్ సర్నేమ్’ క్రికెటర్‌కు 103 ఏళ్లు
క్రికెట్లో పలు రికార్డులతో చరిత్రలో నిలిచిపోవడం సహజం. కానీ ఫిజీకి చెందిన ఓ క్రికెటర్ లాంగెస్ట్ సర్‌నేమ్‌తో వరల్డ్ ఫేమస్. అతని పేరు Ilikena Lasarusa Talebulamainavaleniveivakabulaimainakulalakebalau. IL బులా అని పిలుస్తారు. ఆ పేరుకు ‘లావ్ గ్రూప్ లకెంబా ద్వీపంలోని నంకుల ఆస్పత్రి నుంచి సజీవంగా తిరిగి వచ్చాడు’ అని అర్థం. 1921 NOV 15న పుట్టిన ఇతనికి నేటితో 103 ఏళ్లు. 1947-54 మధ్య 9 మ్యాచ్‌లు ఆడారు.
Similar News
News November 15, 2024
గంభీర్, రోహిత్‌తో విరాట్‌కు విభేదాలున్నాయి: మాజీ క్రికెటర్
కెప్టెన్ రోహిత్, కోచ్ గంభీర్‌తో విరాట్ కోహ్లీకి విభేదాలున్నాయని ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ బ్రెండన్ జూలియన్ అన్నారు. ‘కోహ్లీ న్యూజిలాండ్‌పై ఔటైన తీరు నమ్మశక్యంగా లేదు. అది అతడి ఆట కాదు. తన కెప్టెన్, కోచ్‌తో అతడికి సయోధ్య లేదనిపిస్తోంది. ఆస్ట్రేలియాలో ఇబ్బంది పడతారు. కెప్టెన్‌గా, బౌలర్‌గా బుమ్రా కూడా ఇబ్బంది పడతారు. పెర్త్‌లో ఆస్ట్రేలియా భారత్‌పై సునాయాసంగా గెలుస్తుంది’ అని జోస్యం చెప్పారు.
News November 15, 2024
మాంసంతో పాల ఉత్పత్తులు తినకూడదా?
చికెన్, మటన్, ఫిష్ కూరలతోపాటు పాల ఉత్పత్తులు తినకూడదనే మాట మనం వింటూ ఉంటాం. దీనివల్ల వికారం, డైజేషన్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే అదంతా ఉత్తిదేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ‘ఇలా తినడం హానికరమనే దానికి శాస్త్రీయత లేదు. మాంసం, డైరీ ఉత్పత్తుల నుంచి ప్రొటీన్లు, కొవ్వులను విచ్ఛిన్నం చేయడానికి శరీరం ప్రత్యేక ఎంజైమ్‌లను ఉపయోగిస్తుంది. కాబట్టి జీర్ణక్రియలో సమస్యలు ఉండవు’ అని పేర్కొంటున్నారు.
News November 15, 2024
ఇరాన్ అంబాసిడర్‌తో ఎలాన్ మస్క్ సీక్రెట్ మీటింగ్!
UNలో ఇరాన్ అంబాసిడర్ ఆమిర్ సయీద్‌తో బిలియనీర్ ఎలాన్ మస్క్ సమావేశమైనట్టు తెలిసింది. సోమవారం న్యూయార్క్‌లో వీరిద్దరూ గంటకు పైగా రహస్యంగా చర్చించారని US మీడియా పేర్కొంది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఉద్రికత్తలు తొలగించేందుకు వీరిద్దరూ చొరవ చూపారని సమాచారం. ఇరాన్ న్యూక్లియర్ ప్రణాళికను ఇష్టపడని అమెరికా కొన్నేళ్లుగా దానిపై ఆంక్షలు విధించింది. వెస్ట్ఏషియాలో ఆందోళనను తగ్గించాలని ట్రంప్ భావిస్తున్నారు.