News June 1, 2024
కమలం పార్టీదే అధికారం: Dainik Bhaskar

దేశంలో మరోసారి కమలం పార్టీనే అధికారం చేపడుతుందని Dainik Bhaskar సర్వే తేల్చింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 281-350, ఇండియా కూటమికి 145-201, ఇతరులకు 33-49 సీట్లు వస్తాయని అంచనా వేసింది. పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య టఫ్ ఫైట్ సాగినట్లు తెలిపింది.
Similar News
News November 19, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 9

50. జ్ఞానం అంటే ఏమిటి? (జ.మంచి చెడ్డల్ని గుర్తించగలగడం)
51. దయ అంటే ఏమిటి? (జ.ప్రాణులన్నింటి సుఖం కోరడం)
52. అర్జవం అంటే ఏమిటి? (జ.సదా సమభావం కలిగి ఉండడం)
53. సోమరితనం అంటే ఏమిటి? (జ.ధర్మకార్యములు చేయకుండుట)
54. దు:ఖం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం కలిగి ఉండటం)
55. ధైర్యం అంటే ఏమిటి? (జ.ఇంద్రియ నిగ్రహం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 19, 2025
PM కిసాన్ 21వ విడత.. రూ.18 వేల కోట్లు జమ

దేశ వ్యాప్తంగా అన్నదాతలకు రబీ పెట్టుబడి సాయం కింద PM కిసాన్ 21వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో.. దేశ వ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.18వేల కోట్లను ప్రధాని జమ చేశారు. ఇప్పటి వరకు PM కిసాన్ 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో కేంద్రం జమ చేసింది.
News November 19, 2025
నంబర్-1 ర్యాంక్ కోల్పోయిన రోహిత్

ICC ODI బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో రోహిత్ శర్మ నంబర్-1 స్థానాన్ని కోల్పోయారు. కివీస్ బ్యాటర్ మిచెల్ 782 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకోగా, హిట్ మ్యాన్(781) సెకండ్ ప్లేస్లో నిలిచారు. NZ తరఫున ODIలలో టాప్ ర్యాంక్ సాధించిన రెండో బ్యాటర్గా మిచెల్ రికార్డు సాధించారు. చివరిసారిగా 1979లో టర్నర్ నం.1 అయ్యారు. ఇక 3-10 స్థానాల్లో జోర్డాన్, గిల్, కోహ్లీ, బాబర్, టెక్టర్, అయ్యర్, అసలంక, హోప్ ఉన్నారు.


