News February 8, 2025
ఢిల్లీని కమ్మేసి.. AAPను ఊడ్చేసిన కమలం
ఢిల్లీ ఎన్నికల్లో BJP ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలు రచించింది. ఢిల్లీని ఆనుకొని ఉన్న హరియాణా, UP, రాజస్థాన్‌లో రూలింగ్‌లో ఉండటం, కేంద్రంలోనూ హ్యాట్రిక్ పాలన కొనసాగించడం కమలం పార్టీకి బాగా కలిసొచ్చింది. 2017 నుంచి UPలో, 2023 నుంచి రాజస్థాన్, హరియాణాలో గతేడాది కమలం 2వసారి మళ్లీ అధికారంలోకి రావడంతో కాషాయం శ్రేణులు హస్తిన ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.
Similar News
News February 8, 2025
SA20: సన్ రైజర్స్ హ్యాట్రిక్ కొడుతుందా?
సౌతాఫ్రికా లీగ్ 20 తుది అంకానికి చేరింది. కావ్య మారన్‌కు చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్, ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ నేడు టైటిల్ కోసం తలపడనున్నాయి. రషీద్ సారథ్యంలోని కేప్ టౌన్ టైటిల్‌పై కన్నేయగా ఈస్టర్న్ కేప్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ఇవాళ రాత్రి 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్‌తో పాటు డిస్నీ+హాట్ స్టార్‌లో ప్రసారం కానుంది.
News February 8, 2025
కేసీఆర్‌ను కలిసిన వారంతా ఓటమి: కాంగ్రెస్
ఢిల్లీలో బీజేపీ గెలవడంతో రాహుల్ గాంధీని అభినందిస్తూ KTR చేసిన సెటైరికల్ ట్వీట్‌కు కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ BRS చీఫ్ KCRను కలవడం వల్లే ఓడిపోయారని ట్వీట్స్ చేస్తున్నారు. ‘మనం చెయ్యి కలిపితే మామూలుగా లేదుగా. YS జగన్, నవీన్ పట్నాయక్, థాక్రే, కేజ్రీవాల్’ అంటూ సెటైర్లు వేస్తున్నారు. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ మరోసారి సున్నా సీట్లు గెలిచిందని BRS శ్రేణులూ రీకౌంటరిస్తున్నాయి.
News February 8, 2025
ఇవాళ ‘పుష్ప-2’ థాంక్యూ మీట్
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓటీటీలోకి వచ్చేసిన ఈ మూవీ టాప్ ప్లేస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో ఇవాళ ‘థాంక్యూ మీట్’ నిర్వహించనున్నట్లు మూవీ యూనిట్ పోస్ట్ చేసింది. సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం.