News July 11, 2024

బాలికను చంపిన ప్రేమోన్మాది ఆత్మహత్య

image

AP: అనకాపల్లి జిల్లాలో తొమ్మిదో తరగతి విద్యార్థినిని దారుణంగా హతమార్చిన నిందితుడు <<13579211>>సురేశ్<<>> ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాంబిల్లి మండలం కొప్పగుండుపాలెం శివారులో అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 6న సురేశ్ దర్శిని ఇంటికి వెళ్లి కత్తితో దారుణంగా చంపేశాడు. ప్రేమ పేరుతో వేధించడంతో దర్శిని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సురేశ్ జైలుకు వెళ్లాడు. ఆ కోపంతోనే ఆమెను హతమార్చినట్లు తెలుస్తోంది.

Similar News

News December 1, 2025

గర్భిణుల్లో వికారానికి కారణమిదే..

image

ప్రెగ్నెన్సీలో వికారం కామన్. అయితే ఇది గర్భంలోని శిశువును రక్షించే ప్రక్రియలో భాగమని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు చేసిన పరిశోధనలో తేలింది. కొత్తగా వచ్చిన శిశువుని శరీరం అంగీకరించి, హానికర పదార్థాల నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తుంది. శిశువు DNAలో సగం తండ్రిది కావడంతో పిండాన్ని తల్లి శరీరం ఫారెన్‌ బాడీగా భావిస్తుంది. కొత్తగా శరీరంలో ప్రవేశించిన దేనిమీదైనా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది.

News December 1, 2025

దేవుడు మీకేం ఇవ్వలేదని బాధపడుతున్నారా?

image

పురాణాల్లో దేవుడు కొందరికి ఎన్నో గొప్ప వరాలిచ్చాడని, మాకేం ఇవ్వలేదని కొందరు బాధ పడుతుంటారు. కానీ సమస్త మానవాళికి ఆయన ఓ గొప్ప వరాన్ని అందించాడు. అదే మనకు జ్ఞాన మార్గాన్ని చూపించే ‘భగవద్గీత’. మనిషి మనిషిగా జీవించేందుకు, ధర్మబద్ధంగా ముందుకు వెళ్లేందుకు ఇంతకంటే గొప్ప బహుమానం, వరం ఇంకేమైనా ఉంటుందా? అందుకే గీతా పారాయణం చేయాలంటారు పెద్దలు. గీతా పారాయణం చేద్దాం.. దేవుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకుందాం!

News December 1, 2025

ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

image

AP: దొంగ మస్టర్ల కట్టడికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలకు ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం తీసుకురావాలని భావిస్తోంది. ఇవాళ ప్రయోగాత్మకంగా మన్యం జిల్లాతో పాటు దేశంలోని మరో 2 జిల్లాల్లో అమలు చేయనుంది. పని జరిగే ప్రాంతంలో 10 మీటర్ల పరిధిలో అటెండెన్స్ తీసుకుంటారు. 4 గంటల వ్యవధిలో 2 సార్లు ఇలా చేయాల్సి ఉంటుంది. రెండుమూడు నెలల తర్వాత దేశమంతటా ఈ విధానం అమలయ్యే ఛాన్స్ ఉంది.