News June 5, 2024
ఆ నలుగురి మెజారిటీ లక్ష లోపే..

ఏపీలో వైసీపీ నుంచి గెలిచిన నలుగురు ఎంపీ అభ్యర్థుల మెజారిటీ లక్ష ఓట్లలోపే ఉండటం గమనార్హం. రాజంపేటలో మిధున్ రెడ్డి(76,071), కడపలో అవినాశ్ రెడ్డి(62,695), అరకులో గుమ్మ తనుజా రాణి(50,580), తిరుపతిలో గురుమూర్తి(14,569) విజయం సాధించారు. మరోవైపు ఎన్డీఏ కూటమిలోని 20 మంది అభ్యర్థులకు కనీసం లక్ష ఓట్లకు పైగా మెజారిటీ రాగా ఒంగోలు అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డికి అత్యల్పంగా 50,199 ఓట్ల ఆధిక్యం వచ్చింది.
Similar News
News November 5, 2025
బనకచర్ల, ఆల్మట్టిపై సుప్రీం కోర్టులో పోరాటానికి నిర్ణయం

TG: AP బనకచర్ల ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంపు అంశాలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. ఇప్పటికే నీటిపారుదల, జల వనరుల నిపుణుల నుండి అభిప్రాయం తీసుకుంటోంది. CM రేవంత్ రెడ్డికి దీనికి సంబంధించిన ఫైల్‌ను పంపి ఆయన ఆమోదించిన వెంటనే SCలో ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేయనుంది. ఈ 2 ప్రాజెక్టులపై TG ఇప్పటికే జలశక్తి మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది.
News November 5, 2025
KTR.. రాజీనామాకు సిద్ధంగా ఉండు: CM రేవంత్

TG: సవాళ్లు విసిరి పారిపోవడం KTRకు అలవాటేనని CM రేవంత్ అన్నారు. ఆయన విసిరే సవాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పట్టించుకోరని పేర్కొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఇచ్చిన నిధులపై జీవోలు ఇస్తామని, కేటీఆర్ రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్‌పేట్ రోడ్ షోలో ఆయన ప్రచారం నిర్వహించారు. రాష్ట్రానికి నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
News November 5, 2025
ఆలయ పరిసరాల్లో ఇంటి నిర్మాణం చేపట్టవచ్చా?

దేవాలయాల పరిసరాల్లో నివాసంపై వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు ప్రత్యేక సూచన చేశారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. దేవాలయాల గోపురం నీడ పడనంత దూరం ఇల్లు ఉండాలని ఆయన అన్నారు. ‘ఆలయ శక్తి అధికంగా ఉంటుంది. ఆ గోపురం నీడ పడేంత సమీపంలో ఇల్లు ఉండడం సంసారిక సుఖానికి ఆటంకం కలిగిస్తుంది. గోపురం నీడలో నివాసం ఏర్పరచుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. దైవత్వం పట్ల గౌరవం ఉంచుతూ, ఇంటికి సరైన దూరం పాటించాలి’ అని సూచించారు. <<-se>>#Vasthu<<>>


