News April 15, 2025

సల్మాన్‌ను బెదిరించిన వ్యక్తికి మతిస్థిమితం లేదు: పోలీసులు

image

ఇటీవల సల్మాన్‌ను చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తిని గుజరాత్‌కు చెందిన మయాంక్ పాండ్య(26)గా ముంబై పోలీసులు గుర్తించారు. అతడిని విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తి అని తేలిందని ప్రకటించారు. సల్మాన్ కారును బాంబుతో పేల్చేస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్‌కు ఇటీవల సందేశం వచ్చింది. వోర్లీ పీఎస్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా నిందితుడి విషయం వెలుగుచూసింది.

Similar News

News November 24, 2025

ఖమ్మం: వసతి గృహాల్లో చలికి వణుకుతున్న విద్యార్థులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో చలి తీవ్రతకు విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గీజర్లు పనిచేయక, కిటికీలు సరిగా లేక చలిలోనే నిద్రించాల్సి వస్తోంది. ఈ ఏడాది రగ్గులు, స్వెటర్లు కూడా పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారు. వెంటనే వేడినీటి సౌకర్యం, చలి నుంచి రక్షణకు స్వెటర్లు అందించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

News November 24, 2025

అమరావతిలో ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కానీ సమస్యలు ఇవే..!

image

అమరావతి ప్రాంతంలో గ్రామ కంఠాలు, రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన వీధి పోట్లు సమస్య రైతులను తీవ్రంగా వెంటాడుతుంది. CRDA అధికారులు ఈ సమస్యలపై దృష్టి సారించకుండా కాలయాపన చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. రాజధాని ఏర్పడిన నాటి నుంచి ఈ సమస్య పరిష్కరించకుండా ఒంటెద్దుపోకడి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదంటున్నారు.