News August 22, 2024

యాజమాన్యం నా కాల్స్‌కూ స్పందించట్లేదు: హోంమంత్రి

image

AP: అచ్యుతాపురం సెజ్‌లో ప్రమాదం విషయంలో పరిశ్రమ యాజమాన్యం తప్పిదం ఉందని ఘటనాస్థలాన్ని పరిశీలించిన అనంతరం హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ‘17మంది కన్నుమూయడం బాధాకరం. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాం. నేను కాల్ చేసినా, మెసేజ్ పెట్టినా యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి. తరచూ ప్రమాదం జరిగే సెజ్ ప్రాంతాల్లో ఆస్పత్రుల్ని నిర్మించాలి’ అని ఆమె అభిప్రాయపడ్డారు.

Similar News

News December 3, 2025

WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

image

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.

News December 3, 2025

వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

image

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

News December 3, 2025

స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

image

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.