News September 27, 2024

సిక్ లీవ్‌కు నో చెప్పిన మేనేజర్.. ఆఫీసులోనే ఉద్యోగి మృతి!

image

అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చేరి సెలవులో ఉన్న ఓ ఉద్యోగిని తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని మేనేజర్ హెచ్చరించారు. ఒక్కరోజు సిక్ లీవ్ ఇస్తే కోలుకుంటానని చెప్పగా మేనేజర్ ఒప్పుకోలేదు. దీంతో ఉద్యోగం కోల్పోతానేమోనని ఆమె ఆఫీసుకొచ్చి 20 నిమిషాలు పనిచేయగా కుర్చీలోనే కుప్పకూలింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా గంటల్లోనే చనిపోయారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లోని సముత్ ప్రావిన్స్‌లో ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో జరిగింది.

Similar News

News November 1, 2025

నిర్మాతగా సుకుమార్ భార్య తబిత

image

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత నిర్మాతగా మారనున్నారు. ‘తబితా సుకుమార్ ఫిల్మ్స్’ పేరుతో బ్యానర్ లాంచ్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ కొత్త బ్యానర్‌లో పదేళ్ల కిందట వచ్చిన బోల్డ్ మూవీ కుమారి21F సీక్వెల్ కుమారి22F తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇటీవల రావు రమేశ్ నటించిన ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాకు తబిత సమర్పకురాలిగా వ్యవహరించారు.

News November 1, 2025

ఎల్లుండి నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు

image

AP: ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎల్లుండి నుంచి ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఇందుకోసం 3,013 RSKలు, 2,061 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ‘ఈసారి 51L టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కొనుగోలు చేసిన 24-48 గంటల్లోనే అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాం’ అని పేర్కొన్నారు.

News November 1, 2025

పోలవరం నిర్వాసితులకు రూ 1000 కోట్లు పంపిణీ

image

AP: పోలవరం భూ నిర్వాసితులకు రూ.1000 కోట్లు పంపిణీ చేశారు. ఈ మేరకు నిర్వాసితుల అకౌంట్లలో నగదు జమ చేసినట్లు మంత్రి రామనాయుడు వెల్లడించారు. ఏలూరులోని వేలేరుపాడులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందరికీ అండగా నిలుస్తుందన్నారు. భూసేకరణ, పరిహారం చెల్లింపుల్లో దళారుల మాట నమ్మొద్దని సూచించారు. 2027కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు.