News May 3, 2024

KKRతో మ్యాచ్.. ముంబైకి చావో రేవో

image

ఈరోజు IPLలో మరో ఆసక్తికరమైన మ్యాచ్ అలరించనుంది. ముంబై తనకు చావోరేవోగా మారిన మ్యాచ్‌లో కోల్‌కతాతో తలపడనుంది. 10మ్యాచుల్లో 3 గెలిచిన ముంబై ఇండియన్స్‌ ప్లేఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఈరోజు ఎలాగైనా గెలవాలని ఆ జట్టు పట్టుదలతో ఉంది. మరోవైపు పాయింట్స్ టేబుల్‌లో టాప్ 2లో ఉన్న KKR సైతం ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలని భావిస్తోంది.

Similar News

News April 5, 2026

సౌర కుటుంబం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

image

*సోలార్ సిస్టమ్‌లో 99.86% సూర్యుడే ఉంటాడు
*శుక్రుడిని మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ అని పిలుస్తారు
*భూమికి ఉన్న ఏకైక నేచురల్ శాటిలైట్ చంద్రుడు
*సూర్యుడిని ఫాదర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ అంటారు
*మార్స్‌పై ఉన్న ఐరన్ ఆక్సైడ్ వల్ల దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు
*1,300 భూములను కలిపితే ఒక గురుడు (జూపిటర్)
*జీవం ఉండే ఏకైక గ్రహం భూమి

News April 5, 2026

ప్రతిదీ ప్రేమ కాదు.. త్రిష ఆసక్తికర పోస్టు

image

TVK అధినేత విజయ్‌తో హీరోయిన్ త్రిష ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాలో ఆసక్తికర కోట్‌ను ఆమె షేర్ చేశారు. ‘ప్రతిదీ ప్రేమ కాదు. కానీ ప్రేమ లేకపోతే దేనికీ అర్థం ఉండదు’ అని రాసి ఉన్న ఫొటోకు ‘నిజం’ అని క్యాప్షన్ ఇచ్చారు. సూర్యతో కలిసి ఆమె నటించిన వీరభద్రుడు సినిమా మే 14న రిలీజ్ కానుంది. మరోవైపు చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలోనూ ఆమె యాక్ట్ చేస్తున్నారు.

News April 5, 2026

విజిల్ వేసే చెట్టు.. ఎక్కడుందంటే?

image

ఆఫ్రికాలోని కెన్యా, టాంజానియా వంటి దేశాల అడవుల్లో ఉండే ‘వ్యాచిలియా డ్రెపనోలోబియం’ చెట్టు మనుషుల్లాగే విజిల్ వేస్తుంది. ఈ చెట్టు కాయలకు చీమలు చేసిన రంధ్రాల నుంచి గాలి వేగంగా వెళ్లినప్పుడు అచ్చం మనిషి ఈల లాంటి వింత శబ్దం వినిపిస్తుంది. నిశ్శబ్దంగా ఉండే అడవిలో ఈ సౌండ్స్ వినిపించడంతో పర్యాటకులు ఉలిక్కిపడుతుంటారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో(38/100)