News September 14, 2024
ఒక్క బాల్ పడకుండా మ్యాచ్ రద్దు.. కేవలం 8 సార్లే

నోయిడా వేదికగా జరగాల్సిన కివీస్vsఅఫ్గాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే <<14089444>>రద్దయ్యింది<<>>. టెస్టు క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు కేవలం ఎనిమిదిసార్లే నమోదయ్యాయి. 1890, 1938, 1970లో ఇంగ్లండ్vsఆస్ట్రేలియా మ్యాచ్‌లు, 1988లో కివీస్vsపాక్, 1989లో విండీస్vsఇంగ్లండ్, 1998లో పాక్vsజింబాబ్వే, 1998లో కివీస్vsఇండియా మ్యాచ్‌లు ఒక్క బాల్ పడకుండానే రద్దయ్యాయి.
Similar News
News November 26, 2025
నిరక్షరాస్యుల కోసం ‘అక్షరాంధ్ర’

APలో 15-59 ఏళ్ల వయసున్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు విద్యాశాఖ ‘అక్షరాంధ్ర’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. చదవడం, రాయడంతోపాటు కూడికలు, తీసివేతలను నేర్పిస్తారు. డిజిటల్, ఫైనాన్షియల్, హెల్త్, న్యాయ అంశాలపైనా అవగాహన కల్పిస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ స్కూళ్లు, కమ్యూనిటీ హాళ్లను ఇందుకు వినియోగిస్తారు. ప్రస్తుతం 81L మంది నిరక్షరాస్యులుండగా ఏటా 25L మందికి శిక్షణ ఇవ్వడమే లక్ష్యం.
News November 26, 2025
జిల్లాలు, డివిజన్లు, మండలాల లెక్క ఇదే!

ప్రస్తుతం ఏపీలో 26 జిల్లాలు, 77 రెవెన్యూ డివిజన్లు, 679 మండలాలు ఉన్నాయి. కొత్తగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాలు, నక్కపల్లి, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లి రెవెన్యూ డివిజన్లు, పెద్దహరివాణం మండలం ఏర్పడతాయి. మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత 29 జిల్లాలు, 82 రెవెన్యూ డివిజన్లు, 680 మండలాలు అవుతాయి.
News November 26, 2025
ఇంటర్వ్యూతో ఐఐసీటీలో ఉద్యోగాల భర్తీ

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(<


