News April 14, 2024

ముంబైతో మ్యాచ్‌కూ పతిరణ దూరం!

image

గాయం కారణంగా ఇప్పటికే 2 మ్యాచులకు దూరమైన CSK బౌలర్ పతిరణ ఇవాళ MIతో మ్యాచులో ఆడటం కష్టమేనని CSK కోచ్ ఫ్లెమింగ్ తెలిపారు. ‘పతిరణ గాయం అంత పెద్దదేమీ కాదు. త్వరలోనే అతడు మైదానంలోకి వస్తాడు. కానీ ఆయనకు కొంత విశ్రాంతి అవసరం. వంద శాతం ఫిట్‌గా ఉన్నప్పుడే తీసుకొస్తాం. లేదంటే అతడు మళ్లీ గాయపడితే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 2, 2026

TU: ఏబీవీపీ 2026 క్రీడోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ

image

ఏబీవీపీ తెలంగాణ యూనివర్సిటీ శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి సందర్భంగా క్రీడా పోటీల పోస్టర్లను ఆర్ట్స్ కళాశాలలోని సెమినార్ హాల్లో ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి చిరిగే శివకుమార్ ఆవిష్కరించారు. ‘స్క్రీన్ టైమ్ టు ఆక్టివిటీ టైం’ అనే నినాదంతో విద్యార్థులు సెల్ ఫోన్లు వదిలి మైదానంలోకి రావాలని సూచించారు. క్రీడోత్సవంలో చురుకుగా పాల్గొనాలన్నారు. ABVP నాయకులు హర్షవర్ధన్, శివ, పృథ్వీ ఉన్నారు.

News April 2, 2026

ట్రంప్ వ్యాఖ్యలు పచ్చి అబద్ధం: ఇరాన్

image

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ అభ్యర్థించిందన్న <<19538873>>ట్రంప్<<>> వ్యాఖ్యలను ఆ దేశం ఖండించింది. అవన్నీ అబద్ధమని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవని ఇరాన్ విదేశాంగ శాఖ తాజాగా స్పష్టం చేసింది. దేశంలో అధికార మార్పిడి జరగలేదని, పాత అధ్యక్షుడే కొనసాగుతున్నారని పేర్కొంటూ ట్రంప్ పోస్ట్‌ను కొట్టిపారేసింది.

News April 2, 2026

చంద్రుడి చెంతకు మళ్లీ మనిషి.. రేపే పయనం

image

దాదాపు 50 ఏళ్ల తర్వాత మానవులను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు నాసా ఆర్టెమిస్-II మిషన్‌ సిద్ధమైంది. నలుగురు వ్యోమగాములతో కూడిన ఈ 10 రోజుల జర్నీ ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఏప్రిల్ 2న 3:54 AMకు (భారత కాలమానం) ప్రారంభం కానుంది. ఓరియన్ వ్యోమనౌకలో వెళ్లే ఈ బృందం చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి భవిష్యత్తులో చంద్రుడిపై మనుషులు దిగేందుకు అవసరమైన టెక్నాలజీని పరీక్షిస్తుంది.