News May 27, 2024
జూన్ 1న ‘ఇండియా’ కూటమి నేతల సమావేశం!

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానుండగా, అంతకుముందే జూన్ 1న ఇండియా కూటమి నేతలు సమావేశం కానున్నారట. ఈ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తారని సమాచారం. మరోవైపు అదే రోజున ఏడో విడత పోలింగ్ జరగనుంది. ఈ భేటీకి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ఆయన ఆ తర్వాతి రోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా కోర్టులో సరెండర్ కావాల్సి ఉంది.
Similar News
News January 7, 2026
రాయలసీమ లిఫ్ట్ అంటూ అడ్డగోలుగా పనులు చేశారు: CBN

AP: అనుమతులు లేనందునే రాయలసీమ లిఫ్ట్‌ను NGT నిలిపేసిందని CM CBN స్పష్టం చేశారు. ‘రూ.3,528 కోట్లతో దీన్ని చేపట్టారు. రూ.2,500 కోట్లు ఖర్చుచేశారు. అడ్డగోలుగా పనిచేశారు. కాంట్రాక్టరుకే రూ.900 కోట్లిచ్చారు. ముచ్చుమర్రి నుంచి నీటి తరలింపు అవకాశమున్నా దీన్ని చేపట్టారు. NGT జరిమానా వేసింది’ అని పేర్కొన్నారు. అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదని, తనపై బురదచల్లితే వారికే నష్టం అని అన్నారు.
News January 7, 2026
ఇతిహాసాలు క్విజ్ – 120 సమాధానం

ప్రశ్న: వాలికి ఉన్న విచిత్రమైన వరం ఏమిటి?
సమాధానం: కిష్కింధాధిపతి అయిన వాలితో ఎవరైనా నేరుగా ముఖాముఖి యుద్ధానికి దిగితే, ఆ శత్రువు బలంలో సగం బలం(50%) వెంటనే వాలికి సంక్రమిస్తుంది. దీనివల్ల ఎదుటివాడు బలహీనపడగా, వాలి రెట్టింపు బలంతో శక్తివంతుడవుతాడు. ఈ వరం కారణంగానే వాలికి ఎదురుగా వెళ్తే చంపడం అసాధ్యమని భావించి రాముడు చెట్టు చాటు నుంచి బాణాన్ని ప్రయోగించి వాలిని సంహరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 7, 2026
10 ఏళ్ల పిల్లాడికి హార్ట్ ఎటాక్.. రీల్స్ చూస్తుండగా..

హార్ట్ ఎటాక్‌తో పెద్దలే కాదు యువకులు, పిల్లలు <<18554317>>చనిపోతున్న<<>> ఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. తాజాగా UPలోని అమ్రోహ(D)లో 4వ తరగతి చిన్నారి మరణించాడు. మయాంక్(10) రీల్స్ చూస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం చేయకుండానే అంత్యక్రియలు చేశారని, హార్ట్ ఎటాక్‌కు కారణమేంటో గుర్తించలేకపోయామని చెప్పారు.


