News July 18, 2024
‘ఇంజినీరింగ్’ కనీస ఫీజు రూ.43వేలు

AP: ఇంజినీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం రూ.43 వేలకు పెంచింది. రూ.45వేలు ఇవ్వాలని యాజమాన్యాలు కోరగా, రూ.43 వేలు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా, 2023 జూన్లో ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అమలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో చర్చల అనంతరం కనీస ఫీజు రూ.43వేలుగా ఖరారైంది.
Similar News
News December 15, 2025
జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన

రష్యాతో యుద్ధాన్ని ముగించే విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కొత్త ప్రతిపాదన చేశారు. పశ్చిమ దేశాలు భద్రతపై హామీ ఇస్తే NATOలో చేరాలన్న ప్రయత్నాలను విరమించుకోవడానికి రెడీ అని ప్రకటించారు. ‘కూటమి సభ్యులకు లభించే తరహాలో భద్రతా హామీలు ఆశిస్తున్నాం. రష్యా మరోసారి ఆక్రమణకు దిగకుండా నిరోధించేందుకు మాకు ఇదో అవకాశం’ అని చెప్పారు. తమ భూభాగాన్ని రష్యాకు వదులుకోవాలన్న US ప్రతిపాదనను నిరాకరించారు.
News December 15, 2025
ప్రపంచకప్లో వాళ్లే గెలిపిస్తారు: అభిషేక్ శర్మ

తన సహచర క్రికెటర్లు శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్కు అభిషేక్ శర్మ మద్దతుగా నిలిచారు. రానున్న T20 వరల్డ్ కప్లో వాళ్లిద్దరూ మ్యాచ్లు గెలిపిస్తారని అన్నారు. ‘నేను చాలా కాలంగా వారితో కలిసి ఆడుతున్నాను. ముఖ్యంగా గిల్ గురించి నాకు తెలుసు. అతడిపై నాకు మొదటి నుంచీ నమ్మకం ఉంది. అతి త్వరలో అందరూ గిల్ను నమ్ముతారని ఆశిస్తున్నా’ అని చెప్పారు. కాగా ఇటీవల గిల్, సూర్య <<18568094>>వరుసగా<<>> విఫలమవుతున్న విషయం తెలిసిందే.
News December 15, 2025
లోకేశ్ వెళ్తున్న విమానం దారి మళ్లింపు

AP: ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా మంత్రి లోకేశ్ వెళ్తున్న విమానాన్ని దారి మళ్లించారు. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీకి బయల్దేరగా, విమానాన్ని జైపూర్కు పంపారు. పొగమంచు కారణంగా ఢిల్లీలో ఇప్పటిదాకా 40 విమానాలు రద్దయ్యాయి. మరో 4 విమానాలను దారి మళ్లించారు. మరోవైపు విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ విమానం <<18569475>>ఆలస్యమైన<<>> విషయం తెలిసిందే.


