News September 24, 2024
వరి ధాన్యం కనీస మద్దతు ధర రూ.2,300

AP: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. కామన్ వెరైటీ ధాన్యానికి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 కనీస మద్దతు ధర చెల్లించాలని పేర్కొంది. రైతు సేవా, ధాన్యం సేకరణ కేంద్రాలు, ఈకేవైసీ వంటి వాటి ద్వారా కొనుగోళ్లు చేయాలని ఆదేశించింది. ఈ సీజన్‌లో 37 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది.
Similar News
News November 14, 2025
కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్‌లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.
News November 14, 2025
హరీశ్‌కు అసూయ, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: రేవంత్

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.
News November 14, 2025
వ్యవసాయంలో ‘ఫర్టిగేషన్’ అంటే ఏమిటి?

నీటితో పాటు ద్రవరూపంలో ఉన్న ఎరువులను నిర్ణీత మోతాదులో కలిపి డ్రిప్ ద్వారా మొక్కలకు అందించే విధానాన్ని ‘ఫర్టిగేషన్’ అంటారు. ఈ విధానంలో నీటిలో కరిగే రసాయన, సేంద్రియ ఎరువులను మాత్రమే వాడాలి. పండ్లు, కూరగాయలు, పూల తోటలతో పాటు పత్తి, చెరకు, అరటి, మిరప, ఔషధ మొక్కల సాగుకు ఇది అనుకూలం. ఫర్టిగేషన్‌లో తక్కువ నీటితో సరైన మోతాదులో ఎరువులను అందించి లాభసాటి వ్యవసాయం చేయవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.


