News September 14, 2024
ఆ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి

TG: రాష్ట్రంలోని పామాయిల్ రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మంత్రి నాగేశ్వరరావు రిక్వెస్ట్తో ముడి దిగుమతులపై పన్ను 5.5 నుంచి 27.5 శాతానికి పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇటీవల పామాయిల్ గెలల ధర తగ్గగా కేంద్రం తాజా ఉత్తర్వులతో రైతులకు లాభం చేకూరనుంది. దీంతో గెలల ధర రూ.1,500 నుంచి రూ.1,700 వరకు పెరిగే అవకాశం ఉంది.
Similar News
News November 28, 2025
వరంగల్: ప్రచారానికి వారమే గడువు!

పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ల ఫైనల్ తర్వాత ప్రచారానికి కేవలం వారం రోజులే గడువు ఉంది. మొదటి విడతలో డిసెంబరు 3న అభ్యర్థుల పేర్లు, గుర్తులను ప్రకటించిన అనంతరం 11న ఎన్నికలు జరుగుతాయి. సరిగ్గా 7 రోజుల్లోనే 3,500 మంది ఓటర్లను ప్రసన్నం చేసుకొవాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు కావడంతో కేవలం పార్టీ కండువాలతో, తమకు కేటాయించిన సింబల్ను ఓటర్లకు చెప్పాల్సి ఉంటుంది.
News November 28, 2025
హనుమాన్ చాలీసా భావం – 23

ఆపన తేజ సమ్హారో ఆపై|
తీనోం లోక హాంక తే కాంపై||
హనుమంతుడి తేజస్సు ఎంత శక్తిమంతమైనదంటే.. దానిని కేవలం ఆయనే మాత్రమే స్వయంగా నియంత్రించుకోగలడు. ఆయన పెట్టే ఒక్క కేకకు 3 లోకాలు సైతం భయంతో కంపించిపోతాయి. లోకాలను శాసించగల మహాశక్తిని కలిగిన ఆంజనేయుడు శాంతి స్వరూపుడు కూడా! ఆ అపారమైన శక్తిని మనం పూజించినా, కాపాడమని శరణు వేడినా.. తప్పక రక్షిస్తాడు. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 28, 2025
APPLY NOW: NCPORలో ఉద్యోగాలు

నేషనల్ సెంటర్ ఫర్ పోలార్&ఓషియన్ రీసెర్చ్(NCPOR) 5 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. జీతం నెలకు రూ.56వేలు+HRA చెల్లిస్తారు. వెబ్సైట్: https://ncpor.res.in/


